Skip to main content

Govt and Private Schools: సజావుగా ‘సీస్‌’ పరీక్ష

State Educational Achievement Survey 2023

గుంటూరు ఎడ్యుకేషన్‌: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పరీక్షిచేందుకు నవంబర్ 3న శుక్రవారం స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (సీస్‌–2023) గుంటూరు జిల్లాలోని పాఠశాలల్లో సజావుగా జరిగింది. 482 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 3,6,9వ తరగతుల వారీగా 19,347 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో డైట్‌ అధ్యాపకుల పర్యవేక్షణలో బీఎడ్‌, డీఎడ్‌, ఇంజినీరింగ్‌, పీజీ విద్యార్థులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఎంఈఓలు మండలస్థాయిలో కో–ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. 3వ తరగతిలో 5,690, ఆరో తరగతిలో 6,883, 9వ తరగతిలో 6,774 మంది చొప్పున విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ పి.శైలజ తెలిపారు. తుళ్లూరు మండలం మందడంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పరీక్ష నిర్వహణ తీరు, తెన్నులను పరిశీలించారు.

చ‌ద‌వండి: History of Education: చదువు ఎలా మొదలయ్యింది?

Published date : 04 Nov 2023 03:22PM

Photo Stories