Annual Exams Arrangements: పకడ్బందీగా ఏర్పాటు చేసిన వార్షిక పరీక్షలు.. ఈ తేదీల్లో పరీక్షలు..

వచ్చేనెల ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలకు ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు సిబ్బందులు. మరిన్ని కీలక విషయాలను తెలిపారు అధికారులు..

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలో 1 నుంచి తొమ్మిదో తరగతి వరకు వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 5 తరగతులకు ఏప్రిల్‌ 6 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్‌ 6 నుంచి 19వ తేదీ పరీక్షలు జరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సీబీఏ విధానంలో, 9వ తరగతికి సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు ఉంటాయి.

Course and Employment: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులపై అవగాహన.. ప్రవేశ పరీక్షకు తేదీ..

ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు మాత్రం పాత విధానంలోనే నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 2,874 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,466 ప్రభుత్వ యాజమాన్య పరిధిలో, 408 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,33,925 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Indian Navy: 23 మంది పాకిస్థానీలను కాపాడిన భారత నేవీ

ప్రశ్నపత్రాల పంపిణీకి చర్యలు

మండల విద్యాశాఖ కార్యాలయాలకు ప్రశ్నపత్రాలను చేర్చే పనిలో జిల్లా కామన్‌ ఎగ్జామ్‌ బోర్డు(డీసీఈబీ) నిమగ్నమైంది. ఈనెల 30వ తేదీ నాటికి మండల కేంద్రాలకు ప్రశ్నపత్రాలను పూర్తి స్థాయిలో పంపించే అవకాశం ఉంది. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు వాటిని సరి చూసుకుని ఎమ్మార్సీలో భద్రపర్చుకోవాలి. పరీక్షల ప్రారంభం నుంచి సంబంధిత ప్రశ్నపత్రాల బండిళ్లను ఏరోజుకారోజు పరీక్షకు గంట ముందు ఎమ్మార్సీల నుంచి హెచ్‌ఎంలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Annual Exams: వార్షిక పరీక్షలకు చురుగ్గా ఏర్పాట్లు..

టైం టేబుల్‌ విడుదల

పరీక్షల నిర్వహణకు ఎస్‌సీఈఆర్‌టీ టైమ్‌ టేబుల్‌ విడుదల చేసింది. పరీక్షల నిర్వహణ అనంతరం ఏప్రిల్‌ 21వ తేదీలోగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను ఆన్‌న్‌లైనన్‌లో పొందుపరచాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించారు. ఏప్రిల్‌ 23న ప్రోగ్రెస్‌ కార్డులను విద్యార్థులకు అందజేయడంతో పాటు తరగతి వారీగా ప్రమోషన్‌ జాబితాలు సిద్ధం చేసేందుకు కసరత్తు నిర్వహిస్తున్నారు.

University Students: యూనివర్సిటీ సమస్యలపై విద్యార్థులతో చర్చ..!

ఒకటి నుంచి ఐదు తరగతులకు..

1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్‌ 6న తెలుగు, 8న ఇంగ్లిషు, 10న ఇంగ్లిష్‌ పార్ట్‌–బీ (టోఫెల్‌), 12న గణితం, 13న పరిసరాల విజ్ఞానం పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానమైన పరీక్షలు ఏప్రిల్‌ 13తో ముగుస్తాయి. 15న ఓఎస్‌ఎస్‌సీ, 16న 4వ తరగతి విద్యార్థులకు మాత్రం స్టేట్‌ లెవల్‌ ఎచీవ్‌మెంట్‌ సర్వే (స్లాష్‌) పరీక్షను నిర్వహించనున్నారు.

School Education Department: స్కూల్‌ యూనిఫాం తయారీకి ప్రణాళిక

ఆరు నుంచి తొమ్మిది తరగతులకు

6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్‌ 6న తెలుగు, 8న హిందీ, 10న ఇంగ్లిషు పార్ట్‌–ఏ, 12న ఇంగ్లిషు పార్ట్‌–బీ (టోఫెల్‌), 13న గణితం, 15న ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు జనరల్‌ సైన్స్‌, 9వ తరగతికి ఫిజికల్‌ సైన్స్‌, 16న బయలాజికల్‌ సైన్స్‌, 18న సోషల్‌ స్టడీస్‌, 19న 8, 9 తరగతులకు కాంపోజిట్‌ కోర్సులు/ ఓఎస్‌ఎస్‌సీ1 అండ్‌ 2 పరీక్షలు, అదే రోజు 6, 7 తరగతులకు పేపర్‌–1, పేపరు–2 పరీక్షలు నిర్వహిస్తారు.

Summer Camp for Inter Students: విజ్ఞానం పెంచేందుకే సమ్మర్‌ క్యాంప్‌

పకడ్బందీగా పరీక్షలు

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం. పరీక్షా పత్రాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశాం. పరీక్షలు రాతపూర్వక విధానంలోనే నిర్వహిస్తున్నాం. ఎస్‌సీఈఆర్‌టీ నిబంధనల ప్రకారం పరీక్షలను పాఠశాల స్థాయిలో పక్కాగా నిర్వహించాలి.

– హేమారెడ్డి, డీసీఈబీ సెక్రటరీ, చిత్తూరు

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు–2024 ఫలితాల విడుదలకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు

#Tags