Skip to main content

University Students: యూనివర్సిటీ సమస్యలపై విద్యార్థులతో చర్చ..!

తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల గురించి అక్కడి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు గిరిజన శక్తి విద్యార్థి సంఘం అధ్యక్షుడు. విద్యార్థులతో చర్చించి అక్కడి అధికారులకు వారు చేయాల్సిన ఏర్పాట్ల గురించి వివరించారు..
Meeting with University Students about the issues in institute

తెయూ: తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ మినీ సెమినార్‌ హాల్‌లో గిరిజన శక్తి విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీనునాయక్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనునాయక్‌ మాట్లాడుతూ.. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వర్సిటీ అధికారులను డిమాండ్‌ చేశారు.

AP Tenth Exam Evaluation: ఏప్రిల్‌ 1 నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం.. కేంద్రాల్లో పతిష్ఠ ఏర్పాట్లు..

అలాగే క్యాంపస్‌ హెల్త్‌ సెంటర్‌లో 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండాలని, కొత్తగా బాలికలకు నూతన వసతి గృహం నిర్మించాలని అన్నారు. కార్యక్రమంలో గిరిజన శక్తి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్‌నాయక్‌, నరేశ్‌నాయక్‌, నిఖిల్‌ నాయక్‌, శివనాయక్‌, సంజయ్‌నాయక్‌, కృష్ణ, శ్రీకాంత్‌, సూర్య పాల్గొన్నారు.

Summer Camp for Inter Students: విజ్ఞానం పెంచేందుకే సమ్మర్‌ క్యాంప్‌

Published date : 30 Mar 2024 04:40PM

Photo Stories