Annual Exams: వార్షిక పరీక్షలకు చురుగ్గా ఏర్పాట్లు..
యడ్లపాడు: ఇది పరీక్ష కాలం. ఇప్పటికే కామన్ బోర్డు పరీక్షలు ముగిశాయి. ప్రాథమిక స్థాయి నుంచి మిగిలిన తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. వార్షిక పరీక్షలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎస్‌సీఈఆర్‌టీ(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 6 నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, అనుబంధ, ప్రైవేటు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 1–8 తరగతులకు సీబీఏ–3(క్లాస్‌రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్), 9వ తరగతి వరకూ ఎస్‌ఏ–2 (సంగ్రహాత్మక మూల్యాంకనం) పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఏప్రిల్ 6 నుంచి ఆయా పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు.
School Education Department: స్కూల్ యూనిఫాం తయారీకి ప్రణాళిక
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1–5 తరగతులు చదివే విద్యార్థులకు మాత్రమే డీసీఈబీ ద్వారా ప్రశ్నపత్రాలు అందజేయనుంది. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో 6–9 తరగతులు అభ్యసించే వారందరికీ డీసీఈబీ ప్రశ్నపత్రాలు సరఫరా చేయనుంది. 21న జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంది. 23న ప్రొగ్రెస్ కార్డుల్ని విద్యార్థులకు అందజేయాలి. 24న తరగతి వారీగా ప్రమోషన్ జాబితాలు సిద్ధం చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2024 ఫలితాల విడుదలకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు