Coal India Jobs: ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి గుడ్‌న్యూస్.. రాతపరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం
భారత ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్(CIL)ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 640 ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 640
ఖాళీల విభాగాలు
- మైనింగ్ ఇంజినీరింగ్: 263
- సివిల్ ఇంజనీరింగ్: 91
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 102
- మెకానికల్ ఇంజినీరింగ్: 104
- సిస్టమ్ ఇంజనీరింగ్: 41
- ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్: 39
విద్యార్హత: BE/ BTech పూర్తి చేసిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.దీంతో పాటు గేట్ 2025 స్కోర్ కలిగి ఉండాలి.
వయస్సు: 30/09/2024 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
Mega Job Mela: మెగా ఫారిన్ జాబ్ మేళా..వివిధ దేశాల్లో భారీ జీతాలతో..
ఎంపిక విధానం: గేట్ స్కోర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది
Job Mela: రేపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా
వేతనం: ఎంపికైనవారికి ఏడాది శిక్షణ సమయంలో రూ. 50,000-1,60,000, ఆ తర్వాత 60,000-1,80,000 జీతం ఉంటుంది.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 28, 2024
#Tags