Walk-in Interviews: వైద్య కళాశాలలో ఈ పోస్టులకు వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు

తాత్కాలిక కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్య్వూలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మినారాయణ మాట్లాడారు..

కరీంనగర్‌ టౌన్‌: కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిన ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్ట్‌లను భర్తీ చేసేందుకు ఈనెల 15న వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మినారాయణ తెలిపారు.

Candidates for Inter 1st Year Exams: పరీక్షకు 17,802 మంది ఇంటర్‌ విద్యార్థులు హాజరు

ఆసక్తి గల అభ్యర్థులు కాలేజీ వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ ఫారం డౌన్లోడ్‌ చేసుకొని వివరాలు పూరించి ఈనెల 14వ తేదీలోపు కొతపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అప్లికేషన్‌, రెండు సెట్ల జిరాక్సుకాపీలు సమర్పించాలని తెలిపారు. 15న ఉదయం 10 గంటలకు సంబంధిత ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలో హాజరు కావాలని సూచించారు.

#Tags