Language Training: ఇక్కడ శిక్షణ.. జపాన్‌లో ఉద్యోగం

జపాన్‌ భాష నేర్చుకొని అక్కడ ఉద్యోగం చేసేందుకు అవకాశం అందిస్తుంది ఏపీ నైపుణ్యాభివృద్ధ సంస్థ. అక్కడి అధికారి మాట్లాడుతూ.. ఆసక్తిగల వారంతా ఈ అర్హతలు కలిగి ఉన్న వారైతే భాషపై శిక్షణ అందుకొని విదేశంలో ఉద్యోగం సాధించవచ్చు. మరిన్ని విషయాలను పరిశీలించండి..

తుమ్మపాల: బీఎస్సీ, ఎమ్మెస్సీ, నర్సింగ్‌, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం చదువుతున్న విద్యార్థులకు జపనీస్‌ భాష నేర్పించి జపాన్‌ దేశంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యభివృద్ధి సంస్థ అధికారి టి.చాముండేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్‌ఏవీఐఎస్‌ హెచ్‌ఆర్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి జపాన్‌ దేశంలో పనిచేయడానికి ఉపాధి కల్పిస్తామన్నారు. గ్రాడ్యుయేట్‌, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులన్నారు.

Free Admissions: ఒకటో తరగతిలో ప్రవేశానికి అనూహ్య స్పందన

20 సంవత్సరాల నుంచి 32 మధ్య వయస్సు ఉండాలన్నారు. ఆరు నెలలపాటు శిక్షణ ఉంటుందని, వసతి, ఇతర సదుపాయాల ఖర్చులో ప్రభుత్వం 50 శాతం భరిస్తుందన్నారు. జీతం రూ.లక్ష నుంచి రూ.1.40 లక్షల వరకు ఉంటుందన్నారు. జపాన్‌ దేశంలో ఉద్యోగ అవకాశం కల్పించడానికి కావాల్సిన సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. www.apssdc.in.home. onlineprogramregistration ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 99086 29287 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

#Tags