Corporate Colleges: కార్పొరేట్ కళాశాలలో గిరిజన విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు..
భానుపురి: 2024–25 విద్యా సంవత్సరంలో కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం గిరిజన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గిరిజన వసతిగృహం/ ఆశ్రమ పాఠశాలలో వసతి పొంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన గిరిజన విద్యార్థులు, కేజీబీవీ, ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, జిల్లా పరిషత్, ప్రభుత్వ రెసిడెన్షియల్, జనహర్ నవోదయ విద్యాలయం, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యనభ్యసించి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 7.0 జీపీఏ నుంచి 10 జీపీఏ సాధించిన వారికి కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు telanganaepass.gov.in ఆన్‌లైన్ ద్వారా ఈనెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వార్షిక ఆదాయం రూ.2లక్షలకు మించని కుటుంబాలకు చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు.
Placement Selections in PU: క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఎంపికైన పీయూ విద్యార్థులు..