Heavy Rains in Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భారీ వరదలు.. 300 మంది మృతి!!
Sakshi Education
అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాలు, వరదలు విలవిలాటం సృష్టించాయి.
బఘ్లాన్ ప్రావిన్స్‌లో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస అంచనా వేసింది. పలు గృహాలు ధ్వంసమయ్యాయి. భారీ ఆస్తినష్టం జరిగింది. ఉత్తర అఫ్గానిస్థాన్ ఈ వరదలకు తీవ్రంగా ప్రభావితమైంది. బదాక్షన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సులు కూడా దెబ్బతిన్నాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో వరుసగా ప్రకృతి విపత్తులు సంభవిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుడడంతో నదులు, వాగులు పొంగిపొర్లుతూ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తాయి. పలు గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Unhealthy Air: ప్రపంచంలోనే అనారోగ్యకరమైన గాలి ఉన్న నగరాల్లో అగ్రస్థానంలో ఉన్నదిదే..
Published date : 13 May 2024 10:40AM