Skip to main content

Free Admissions: ఒకటో తరగతిలో ప్రవేశానికి అనూహ్య స్పందన

ఒకటో తరగతి విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేటు బడుల్లో ప్రవేశాలు ఉచితం అని ప్రకటించిన తరువాత వారి నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రకటించిన తేదీ నుంచి సోమవారం వరకు ఇన్ని దరఖాస్తులు అందాయి..
Applying for Free Class I Admissions   Free admissions for first class students in Private and Corporate Schools

విశాఖ విద్య: ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశం కోసం విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సోమవారం వరకు ఆన్‌లైన్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 18,231 దరఖాస్తులు అందాయి. వీటిలో అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 30, అనకాపల్లి నుంచి 1,283, విశాఖ జిల్లా నుంచి 2,577 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల కంటే విశాఖ జిల్లా నుంచే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Job Mela: ఏయూ ఎంప్లాయిమెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉద్యోగావకాశం

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని గతంలో కంటే ఈసారి ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖాధికారులు ఫోకస్‌ పెట్టారు. ఉచిత విద్య ప్రవేశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించటంతో పాటు, అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకునేలా పర్యవేక్షణ చేసేందుకు సమగ్ర శిక్ష ఏపీవో అప్పలనాయుడును నోడల్‌ అధికారి అధికారిగా నియమించారు. అదే విధంగా మండల స్థాయిలో ఎంఈవోలకు బాధ్యతలు అప్పగించారు. గడువులోగా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా సచివాలయ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని డీఈవో చంద్రకళ క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు.

Published date : 12 Mar 2024 01:23PM

Photo Stories