Job Mela: ఏయూ ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉద్యోగావకాశం
Sakshi Education
బుధవారం దివ్యాంగుల కోసం ఏయూలో ప్రత్యేకంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్తీకి ఉన్న పోస్టుల గురించి తెలిపారు డిప్యూటీ చీఫ్. పూర్తి వివరాలను పరిశీలించండి..

ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 13న దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీఫ్ కె.దొరబాబు తెలిపారు. యూత్ ఫర్ జాబ్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నామన్నారు. డిమార్ట్, మ్యాక్స్ ఫ్యాషన్, రాథోడ్‌సన్స్ సంస్థలో 10 చొప్పున, పిజ్జా హట్‌లో 12 చొప్పున కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలు భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.
KGBV Admissions: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..
పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగి 18–25 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులు. ఆసక్తి గల వారు ఆరోజు ఉదయం 10.30 గంటలకు ఏయూలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9666092491లో సంప్రదించాలని సూచించారు.
Published date : 12 Mar 2024 12:40PM
Tags
- job offers
- jobs for disabled
- employment offer
- Job Mela at Andhra University
- employment bureau office
- job posts
- Education News
- Sakshi Education News
- Andhra University
- interviews at andhra university
- anakapalle news
- DeputyChiefKDorababu
- EmploymentBureauOffice
- AndhraUniversity
- Opportunity
- AUCampus
- SpecialJobFair
- sakshieducationlatest job notifications