Job News: ఉద్యోగాల‌ను రెగ్యుల‌ర్ చేయాల‌ని నిర‌స‌న‌

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా, నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం రెగ్యుల‌ర్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న మొదలు పెట్టారు.
employees rally requesting government to make jobs regular

సాక్షి ఎడ్యుకేష‌న్: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) స్కీంలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట కళ్లకు నల్లరిబ్బన్‌ కట్టుకొని నిరసన తెలిపి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు.

Teacher's Felicitation: ఉపాధ్యాయులకు ఘ‌నంగా స‌త్కారం

ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ నేషనల్‌ హెల్త్‌ స్కీంలో 23 ఏళ్ల నుంచి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్టులు, డెంటల్‌ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు, అర్బన్‌హెల్త్‌ సెంటర్‌ పీహెచ్‌ఎం సపోర్టింగ్‌ స్టాఫ్‌, కాంటీటీజింగ్‌ వర్కర్లు, సెక్యూరిటీ వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న ప్రతిఒక్కరినీ ప్రభుత్వం రెగ్యులర్‌ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీకేయంయూ రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సాగర్‌, శ్రీకాంత్‌, సరిత, ప్రసాద్‌, ప్రశాంత్‌, మంగ, సంతోష్‌, అర్చన, కమరుద్దిన్‌, నందిని, సుగుణ, లక్ష్మి, సుజాత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

#Tags