Employees Strike: ఉద్యోగుల స‌మ్మేకు తాత్కాలిక విర‌మ‌ణ‌

ఉద్యోగులు చేప‌ట్టిన స‌మ్మేను డీఈఓ సంద‌ర్శించారు. వారి డిమాండ్ల‌ను గురించి పుర్తిగా తెలుసుకున్నారు. వారంద‌రి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాన్ని, మార్గాన్ని క‌ల్పిస్తామ‌న్నారు. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా వారు విద్యాశాఖ మంత్రిని సంద‌ర్శించారు.
DEO Pranitha speaks to employees and employment officer

సాక్షి ఎడ్యుకేష‌న్: తమ సేవలను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో 24రోజుల పాటు సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెను గురువారం తాత్కాలికంగా విరమించారు. డీఈవో ప్రణీత కలెక్టరేట్‌ ఎదుట గల సమ్మె శిబిరాన్ని సందర్శించారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల సూచనలు వారికి వివరించారు. సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎస్‌పీడీ దేవసేన ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Jobs news: ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

దీంతో డీఈవో హామీ మేరకు సమ్మెను 48 గంటల పాటు తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్‌ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. హామీ రాని పక్షంలో తిరిగి సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంఘం బాధ్యులు ప్రవీణ్‌, వెంకటి, ధరంసింగ్‌, సలీం, వెంకన్న, వినోద్‌, పార్థసారథి, రేణుక, సోమన్న, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags