Skip to main content

Jobs news: ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Lab Technician
Lab Technician

విజయనగరం ఫోర్ట్‌: వైద్యారోగ్యశాఖ పరిధిలోని లంకాపట్నం యూపీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టు–1, ఎస్‌ఎన్‌సీయూలో సపోర్టింగ్‌ స్టాఫ్‌ పోస్టు–1 ఖాళీలు ఉన్నాయని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌. భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు ఈడబ్ల్యూఎస్‌ మహిళ, సపోర్టింగ్‌ స్టాఫ్‌ పోస్టుకు ఓసీ–మహిళా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈనెల 26 వతేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. విద్యార్హతలు, వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల కాపీలపై గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించాలని పేర్కొన్నారు.

Published date : 22 Sep 2023 08:06PM

Photo Stories