IT jobs: ఐటీ ఉద్యోగాల వెల్లువ.. గ్రామీణ యువతకు నెర‌వేరుతున్న‌ కలలు

స్థానికంగా ఉంటూ ఐటీ ఉద్యోగం చేయాలనే గ్రామీణ, పట్టణ యువత కలలు నెరవేరుతున్నాయి.
IT jobs in Siddipet

ఐటీహబ్‌ అందుబాటులోకి రావడంతో ఐటీ కంపెనీలు సిద్దిపేట వేదికగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందుకోసం స్థానిక యువతను వివిధ కంపెనీలు ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో న‌వంబ‌ర్ 27న సిద్దిపేట ఐటీ హబ్‌లో వివిధ కంపెనీలు 160 ఖాళీలకు సంబంధించి ఇంటర్వ్యూలు, గ్రూప్‌ డిస్కషన్‌, కౌన్సిలింగ్‌ నిర్వహించాయి. టీం అప్‌, ఫిక్సిటీ ఎడ్యూటెక్‌, కామర్స్‌ సీఎక్స్‌ ఐటీ కంపెనీలు కొత్త వారిని నియమించుకున్నాయి. 
మొబైల్‌ అప్లికేషన్స్‌కు రూపొందించేందుకు టీం అప్‌ కంపెనీ 30 మందిని, అలాగే మార్కెటింగ్‌, కంప్యూటర్స్‌ విభాగంలో పనిచేసేందుకు ఫిక్సిటీ కంపెనీ 80 మందిని, కామర్స్‌ సీఎక్స్‌ అనే కంపెనీ 50 మందిని ఎంపిక చేశాయి. టాస్క్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వారిలో 30 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం ఐటీ హబ్‌లో 370 మంది ఉద్యోగాలు చేస్తుండగా కొత్తగా 160 మంది ఉద్యోగాలు పొందారు.

8773 Bank Jobs 2023: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు... ఎంపిక విధానం...

సంతోషంగా ఉంది...
పుట్టిపెరిగిన ఊరిలోనే ఐటీ రంగంలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ఐటీ హబ్‌ సిద్దిపేటలో ఏర్పాటు కావడంతో నాలాంటి వారికి ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందనే బాధ తప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ ఉద్యోగం చేయనుండటం గొప్ప అనుభూతినిస్తుంది. – శ్రీనాథ్‌, సిద్దిపేట

హాస్టల్‌లో ఉండే బాధ తప్పింది
సిద్దిపేటలోనే ఐటీ ఉద్యోగం రావడంతో దూర ప్రాంతంలో హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేసుకునే బాధ తప్పింది. హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేసుకునే వారికి భోజనం సరిపడక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు భోజనం విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.   – సుప్రియ, సిద్దిపేట

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

#Tags