Work From Home Jobs For Women: పర్మినెంట్‌గా వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగాలు.. ఇంటినుంచే హ్యాపీగా పని చేసుకోవచ్చు

ఉద్యోగం చేయాలని గట్టిగా అనుకున్నా... పని ఒత్తిడి వల్ల ఇల్లు దాటలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది మహిళలు. ఇలాంటి వారికి కొత్త సంవత్సరం(New Year)లో వర్క్‌–ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాలు(Work from Home) స్వాగతం పలుకుతున్నాయి. ఇంటి పని, ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఇల్లు దాటకుండానే చేసే ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోంది. మచ్చుకు కొన్ని...
Work From Home Jobs For Women

వర్చువల్‌ అసిస్టెంట్‌
విఏ (వర్చువల్‌ అసిస్టెంట్‌(Virtual Assistant) ఉద్యోగాలకు కొత్త సంవత్సరంలో మరిన్ని అవకాశాలు పెరగబోతున్నాయి.ఇ–మెయిల్స్, అపాయింట్‌మెంట్స్, బుకింగ్స్, ట్రావెల్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అకౌంట్లు...మొదలైన క్లరికల్, సెక్రటేరియల్‌ విధులను నిర్వహించే ఉద్యోగం వర్చువల్‌ అసిస్టెంట్‌. బాగా ఆర్గనైజ్డ్‌గా ఉండి వర్చువల్‌ పనులను సంబంధించి సులభంగా కమ్యూనికేట్‌ చేయగల సామర్థ్యం ఉన్న మహిళలకు ఈ ఉద్యోగం సరిౖయెనది.

సోషల్‌ మీడియా మేనేజర్‌
వివిధ వ్యాపారాలకు ఇప్పుడు సోషల్‌ మీడియా తప్పనిసరి అవసరం కావడంతో ‘సోషల్‌ మీడియా మేనేజర్‌’ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగింది. వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి పోస్ట్‌’ ప్లానింగ్‌ చేయడం, పోస్ట్‌కు సంబంధించిన కంటెంట్‌ జనరేట్‌ చేయడం, ఫాలోవర్స్‌తో ఎంగేజై ఉండడం... మొదలైనవి సోషల్‌ మీడియా మేనేజర్‌ పనులలో ఉన్నాయి. కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అయ్యే, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్న మహిళలు ఈ ఉద్యోగాన్ని సులభంగా చేయవచ్చు.

Important Dates In January: జనవరి నెలలో జరుపుకునే ముఖ్యమైన రోజులివే


ఆన్‌లైన్‌ ఈవెంట్‌ ప్లానర్‌
వెబినార్స్, కాన్ఫరెన్స్‌లు, ఆన్‌లైన్‌ వర్కషాప్‌లు... మొదలైన ఆన్‌లైన్‌ ఈవెంట్స్‌ నిర్వహించే ఉద్యోగం ఆన్‌లైన్‌ ఈవెంట్‌ ప్లానర్‌. ఆర్గనైజేషనల్, కమ్యునికేషన్, క్రియేటివ్‌ స్కిల్స్‌కు సంబంధించిన ఉద్యోగం ఇది.ఈవెంట్స్‌ కో ఆర్డినేట్‌ చేయడం, వెండర్‌ అండ్‌ స్పీకర్‌ మేనేజ్‌మెంట్, టెక్నికల్‌ కోఆర్డినేషన్‌.. మొదలైనవి ఆన్‌లైన్‌ ఈవెంట్‌ ప్లానర్‌ బాధ్యతల్లో ఉంటాయి.

ఆన్‌లైన్‌ ట్యుటోరింగ్‌
కరోనా కాలంలో ఆన్‌లైన్‌ ట్యుటోరింగ్‌(Online Tutoring) అనేది ఉపాధి మార్గంగా బలపడింది. భాషా ప్రావీణ్యం నుంచి గణితం, సైన్స్‌లాంటి సబ్జెక్ట్‌లలో ప్రతిభ వరకు ఆన్‌లైన్‌ ట్యుటోరింగ్‌ మీకు ఉపయోగపడుతుంది. వేదాంతు, బైజు, ట్యుటోర్‌మీ... మొదలైన ఎన్నో ఆన్‌లైన్‌ ట్యుటోరింగ్‌ మోడల్స్‌ ఉన్నాయి. జాతీయంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఇంటి నుంచే ఉద్యోగం చేయవచ్చు.

Free tailoring training for women: మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ

కస్టమర్‌ సపోర్ట్‌ రిప్రెజెంటివ్‌
కస్టమర్‌ సర్వీస్‌ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఇంటినుంచి ఉద్యోగం చేయాలనుకునే మహిళలకు ఈ ఉద్యోగాలు అనుకూలం. కస్టమర్‌ల సందేహాలకు ఫోన్, ఇ–మెయిల్, చాట్‌... మొదలైన వాటి ద్వారా సమాధానం ఇవ్వడంలాంటి పనులు ఉంటాయి. ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా అర్థమయ్యేలా చెప్పే సామర్థ్యం మీలో ఉంటే ఈ ఉద్యోగం మీకోసమే. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags