Job Mela: జాబ్‌మేళాకు విశేష స్పందన.. 250కి పైగానే ఎంపిక
Sakshi Education
చింతపల్లి: స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాకు టాటా ఎలక్ట్రానిక్స్ తదితర పలు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.ఈ మేళాలో చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు తదితర మండలాల నుంచి వచ్చిన నిరుద్యోగులు పాల్గొన్నారు.
262 మందిని శిక్షణకు ఎంపిక చేశారు.శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎం.గంగరాజు,టి.సుధాకర్, ధనుంజయ్,వి.పి.ఎ. రాజు,ఎన్.శ్యాంకుమార్, కళాశాల అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస పాత్రుడు,లీలాపావని,సంతోషి,డాక్టర్ కెజియా పాల్గొన్నారు.
Telangana High Court Recruitment 2025: హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
జాబ్‌మేళా ముఖ్యసమాచారం
ఎక్కడ జరిగింది: చింతపల్లి డిగ్రీ కళాశాల
ఎప్పుడు: జనవరి 6న
ఎంపికైన అభ్యర్థులు: 260
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 08 Jan 2025 09:34AM