Good News for Unemployees : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. గురుకులాల్లో ఈ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ అందించింది గురుకుల పాఠ‌శాల‌..

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ అందించింది గురుకుల పాఠ‌శాల‌.. ఇక్క‌డ ప‌లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భ‌ర్తీ చేసేందుకు ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా, స్వార్డ్‌ ఏజెన్సీ నిర్వాహకులు ఉద్యోగ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. జిల్లా మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయంలో గణితం, హిందీ విభాగాల్లో, ఆఫీసు సబార్టినేట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Railway Recruitment: రైల్వేలో 32 వేల ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైన వారు కూడా అర్హులు..

కాగా, ఇందుకు అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు దరఖాస్తులు చేసుకోవ‌చ్చు. అంతేకాదు, జిల్లా మైనార్టీ జూనియర్‌ కాలేజీలో కూడా స్టాఫ్‌నర్స్‌ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్వార్డ్‌ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల‌కు.. గణితం సబ్జెక్టుకు ఎమ్మెస్సీ బ్యాథ్స్‌, బీ.ఈడీ, హిందీ హెచ్‌పీటీ, బీఈడీ విత్‌ పీజీ హిందీ అర్హత ఉండాలని, స్టాఫ్‌నర్స్‌ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్‌ అర్హత, సబార్డినేట్‌ పోస్టుకు 10వ తరగతి అర్హత కలిగి ఉండాలని తెలిపారు.

New Year Jobs News: కొత్త ఏడాదిలో 10 లక్షల కొలువులు! .... ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్, జీసీసీల ద్వారా అవకాశాలు

ఈ ఉద్యోగాల‌కు దరఖాస్తులు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు ఈనెల అంటే, డిసెంబ‌ర్‌ 7వ తేదీలోపు జిల్లా మైనారిటీ కార్యాలయంలో సమర్పించాలి.,  దరఖాస్తుదారులు జిల్లా వాస్తవ్యులు అయి ఉండాలని, పూర్తి వివకాలకు సెల్‌ నం.9441780107, 746603995 లను సంప్రదించాలని తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags