Railway Jobs: రైల్వేలో 32 వేల ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైన వారు కూడా అర్హులు..
రైల్వే శాఖలోని పలు విభాగాల్లో.. పాయింట్స్‌మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా 32,000 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే బోర్డు లెవెల్-1 (గ్రూప్-డీ) పోస్టులకు కనీస విద్యార్హత నిబంధనలను సడలించింది.
కొత్త నిబంధనల ప్రకారం.. 10వ తరగతి పాసైన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అదనంగా, ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఇప్పటివరకు.. టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయాలంటే పదో తరగతి ఉత్తీర్ణత, ఎన్ఏసీ లేదా ఐటీఐ డిప్లొమా ఉండాల్సిన నిబంధనలు ఉన్నాయి. అయితే, ఈ పాత నిబంధనలను రైల్వే బోర్డు తాజాగా రద్దు చేసింది. ఈ కొత్త నిర్ణయం బట్టి 32000 లెవెల్-1 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
దరఖాస్తు ప్రక్రియ: జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు..
వయో పరిమితి: ఈ పోస్టుల భర్తీకి 18-36 ఏళ్లు మధ్య వయస్సు ఉండాలి (2025 జనవరి 7 నాటికి). ఎస్‌సి, ఎస్‌టి, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇవ్వబడింది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రారంభ వేతనం: నెలకు రూ.18,000 వరకు..
వెబ్‌సైట్: https://indianrailways.gov.in
Tags
- Railway Board Jobs
- Railway Recruitment
- Railway Board
- railway jobs
- Group D Recruitment
- National Apprenticeship Certificate
- National Council for Vocational Training
- Level-1 posts
- RRB Group-D recruitment
- RRB Group D
- RRB recruitment
- Railway jobs Notification
- Sakshi Education News
- EducationalQualificationRelaxation
- IndianRailwaysJobs
- Railway Recruitment 2024
- Assistant jobs in Railways
- Track Maintainer posts
- 32
- 000 railway vacancies
- AssistantPostsRailway
- Level1GroupDJobs
- RailwayBoardJobs2025
- TrackMaintainerRecruitment
- RailwayJobsNotification
- latest jobs in 2025
- sakshieducation latest job notifications 2025