Fake Jobs: నకిలీ వెబ్‌సైట్‌తో ఉద్యోగాలంటూ మోసం!

ఫసల్‌ బీమా అసిస్టెంటు ఉద్యోగాలు అంటూ నకిలీ నోటిఫికేషన్‌.

కర్నూలు(అగ్రికల్చర్‌): ఫసల్‌ బీమా అసిస్టెంటు ఉద్యోగాలను మండలాల వారీగా కల్పిస్తున్న భారతీయ కో–ఆపరేటివ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్‌ నకిలీదని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Good News: 25న మినీ జాబ్‌ మేళా

కొద్ది రోజులుగా ఫసల్‌ బీమా అసిస్టెంటు ఉద్యోగాలు అంటూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. నిరుద్యోగులను దగా చేసి సొమ్ములు కొల్లగొట్టేందుకు కో–ఆపరేటివ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఫేక్‌ వెబ్‌సైట్‌ క్రియేట్‌ అయిందని, దీనిని ఎవ్వరు నమ్మవద్దని సూచించారు.

భారతీయ కో–ఆపరేటివ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌పై ఢిల్లీలో క్రిమినల్‌ కేసు నమోదు అయిందన్నారు.

Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

#Tags