Skip to main content

Good News: 25న మినీ జాబ్‌ మేళా

సాక్షి ఎడ్యుకేష‌న్ : నిరుద్యోగ యువత కోసం ఏపీ స్కిల్‌ హబ్‌, స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలోని జేకేసీ సంయుక్తంగా ఈ నెల 25న మినీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి.కృష్ణాజీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
mini job mela in andhra pradesh
mini job mela in andhra pradesh

హెటిరో డ్రగ్స్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించేందుకు స్థానిక కళాశాల ప్రాంగణంలో 25న ఉదయం 10 గంటల నుంచి ఆ పరిశ్రమల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 

AP DSC 2023 Notification: ఆగ‌స్టులో మెగా డీఎస్సీ-2023 నోటిఫికేష‌న్‌.. అలాగే ఈ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితిని..


హెటిరో డ్రగ్స్‌ పరిశ్రమలో 80 ఖాళీలు ఉన్నాయని, ఈ పోస్టులకు బీఎస్సీ, బీకాం, ఎంఎస్సీ, బీఏ, ఐటీఐ, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌లో 120 ఖాళీలు ఉన్నాయని, ఈ పోస్టులకు బీఎస్సీ కెమిస్ట్రీ, సీబీజెడ్‌ గ్రూపులతో పాటు ఎంఎస్సీలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, అనలిటికల్‌ కెమిస్ట్రీ విద్యార్హత కలిగి, 18 నుంచి 27 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.

Published date : 22 Jul 2023 04:53PM

Photo Stories