Job Opportunities: గుడ్‌న్యూస్.. ఆ రంగంలో 11 కోట్ల ఉద్యోగాలు
Sakshi Education
న్యూఢిల్లీ: దేశ సహకార రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. 2030 నాటికి నేరుగా 5.5 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పించనుంది. అదే విధంగా మరో 5.6 కోట్ల మంది పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. ఈ వివరాలను మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ‘ప్రైమస్ పార్ట్‌నర్స్’ వెల్లడించింది. ‘భారత సహకార విప్లవం’ పేరుతో సహకార రంగంపై గురువారం ఒక నివేదికను విడుదల చేసింది.
‘‘భారత్ 2030 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యంతో అడుగులు వేస్తోంది.అలా చూస్తే సహకార రంగం ఆశావాదానికి, సామర్థ్యానికి ఆధారంగా కనిపిస్తోంది’’అని ఈ నివేదిక పేర్కొంది.
Breaking News All Schools Holiday: స్కూల్స్, కాలేజీలు బంద్.. రెడ్ అలెర్ట్ జారీ
‘‘2006–07 నాటికి సహకార రంగం 1.54 కోట్ల మందికి స్వయం ఉపాధి కల్పించగా, 2018 నాటికి ఇది 3 కోట్లకు విస్తరించింది.ఏటా 5–6 శాతం చొప్పున పెరిగినా 2030 నాటికి 5.6 కోట్ల మేర స్వయం ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఏర్పడనున్నాయి’’అని వివరించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 30 Nov 2024 02:35PM