కడప కోటిరెడ్డిసర్కిల్/ వేంపల్లె: జిల్లా ఉపాధి కార్యాలయం, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు వేంపల్లెలోని వెలుగు కార్యాలయంలో ప్రముఖ కంపెనీలచే జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాఽధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Job Mela Job fair for unemployed youth
ఎల్‌ఎంఎస్ కార్పొరేట్ సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్, అల్ డిక్సన్ కంపెనీలో వివిధ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై 18–35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఇందుకు అర్హులన్నారు.
ఎంపికై న వారికి రూ. 12 వేల నుంచి రూ. 21 వేల వరకు హోదాను బట్టి వేతనం ఉంటుందన్నారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హతల ధృవపత్రాలు, ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.