Skip to main content

Unemployed: నిరుద్యోగులకు స్వచ్ఛంద సంస్థ టోకరా

ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఓ నిరుద్యోగి మధ్యవర్తి ద్వారా ఆన్‌లైన్‌లో ఇంట ర్వ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత నియామకపత్రం అందుకుని చాంద పాఠశాలకు వెళ్లాడు. ని యామకపత్రం చూసిన ప్రధానోపాధ్యాయు డు అతడిని అటెండర్‌గా జాయిన్‌ చేసుకున్నా డు. దీంతో అతడు నాలుగు రోజులుగా పనిచేస్తున్నాడు. కాగా, తనకు నెలకు రూ.15వేల వేతనం ఇస్తామని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపినట్లు అతడు వివరించాడు.
Charity organization cheating unemployed

ఆదిలాబాద్‌టౌన్‌: నిరుద్యోగుల అవసరం.. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ స్వచ్ఛంద సంస్థ జిల్లాలో అక్రమ దందాకు తెరలేపింది. అందిన కాడికి దండుకుని నకిలీ నియామక పత్రాలను నిరుద్యోగ యువతకు అందజేసి ఆయా పాఠశాలలకు పంపిస్తోంది. అక్కడ జాయిన్‌ అయినవారు చివరికి వేతనాలు రాక మోసపోయామని గ్రహిస్తూ బోరుమంటున్నారు. తాజాగా నాలుగు రోజుల క్రితం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటన విద్యాశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. స్వచ్ఛంద సంస్థలను పాఠశాలల్లోకి అనుమతించవద్దని గతంలోనే ఆదేశాలు జారీ చేసినా ఆ స్వచ్ఛంద సంస్థ అక్రమ దందా సాగిస్తోంది.

‘కాసు’ల కోసమే..
సదరు స్వచ్ఛంద సంస్థ కాసుల కోసమే ఈ దందా కు తెరలేపినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ పట్టణంలోని చిల్కూరిలక్ష్మీనగర్‌కు చెందిన ఓ నిరుద్యోగ మహిళను ఖోడద్‌ పాఠశాలలో అటెండర్‌గా నియమించినట్లు నియామక పత్రాన్ని పంపించారు. రూ.లక్ష వరకు ఆమెను అడిగినట్లు సమాచారం. నె లకు రూ.15వేల వేతనం ఉంటుందని, ఇందులో పీ ఎఫ్‌ ఖాతాకు రూ.1,500 జమ కానుండగా, రూ. 13,500 వేతనం వస్తుందని నమ్మించారు. ఈనెల 8న ఇలా పలువురిని ఆయా పాఠశాలల్లో నియమించారు. వీరిని 2027 వరకు కొనసాగించనున్నట్లు అగ్రిమెంట్‌ చేసుకుని ఉత్తర్వులు అందించారు.

చ‌ద‌వండి: Telangana: ‘TSPSC’పై హైకోర్టు జడ్జితో..న్యాయ విచారణ!

గతేడాది కూడా ఇలాగే..
గతేడాది కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఆర్పీఎల్‌ పాఠశాలలో విద్యావలంటీర్‌ను నియమించినట్లు నియామక పత్రాన్ని అందజేశారు. నెలపాటు పనిచేసిన ఆ నిరుద్యోగికి వేతనం రాకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ సంస్థ ఫేక్‌ అని తేలడంతో లబోదిబోమన్నాడు. కొంతమంది ఆ సంస్థకు కొంత మొత్తాన్ని ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ నకిలీదో.. కాదో అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా నియామకాలు ఎలా చేపడతారని పలువురు చర్చించుకుంటున్నారు.

అక్రమాలకు చెక్‌ పడేదెప్పుడో..!
అక్రమ దందాకు తెరలేపిన కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆగడాలకు చెక్‌ పడటం లేదు. మోసపోయేవారు ఉంటే.. మోసం చేసేవారికి కొదవ లేదన్న చందంగా పరిస్థితి మారింది. గతేడాది ఓ మాయలేడీ రి మ్స్‌లో ఉద్యోగాలిప్పిస్తామని చాలామంది నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసింది. ఫిర్యాదులు అందుకున్న పోలీసున్నామెను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించిన విషయం తెలిసిందే.

చ‌ద‌వండి: Teacher Jobs: త్వ‌ర‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ.. టెట్‌లో ఉత్తీర్ణులు ఇలా..

నా దృష్టికి రాలేదు
స్వచ్ఛంద సంస్థ ద్వారా పాఠశాలల్లో అటెండర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల నియామకం విషయం నా దృష్టికి రాలేదు. పాఠశాలల్లో వారు చేరినట్లు సమాచారం లేదు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎలాంటి సమాచారం అందలేదు. ఏ స్వచ్ఛంద సంస్థ కూడా నియామకాల కోసం మా నుంచి అనుమతి తీసుకోలేదు.
– ప్రణీత, డీఈవో

అధికారుల అనుమతి లేకుండానే..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జిల్లాలోని పలు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫోన్‌ చేసి పాఠశాలలో ఏమి అవసరాలున్నాయో నెల క్రితం తెలుసుకున్నారు. పలువురు ఉపాధ్యాయులు కంప్యూటర్లు, ఆఫీస్‌ సబార్డినేటర్లు అవసరమని తెలిపారు. నాలుగు రోజుల కిందట ఆదిలాబాద్‌ మండలం చాంద పాఠశాలకు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఓ అటెండర్‌ను నియమించారు. అలాగే తలమడుగు మండలం ఖోడద్‌ పాఠశాలకు అటెండర్‌ను పంపుతామని ప్రధానోపాధ్యాయురాలికి ఫోన్‌ చేయగా, ఆమె నిరాకరించారు. నిబంధనల ప్రకారం ఎవరినైనా పాఠశాలల్లో నియమిస్తే డీఈవో, ఎంఈవో అనుమతి తప్పనిసరి. వారి ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మాత్రం డీఈవో, ఎంఈవో ఎస్‌ఎంసీ కమిటీ అనుమతి లేకుండా అటెండర్లను నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. ఇందుకు 14 పాఠశాలలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇలా 30 మందిని నియమించినట్లు తెలిసింది. కొందరు హెచ్‌ఎంలు ఇలా వచ్చిన వారిని విధుల్లో చేర్పించుకోగా, మరికొందరు నిరాకరించారు.

sakshi education whatsapp channel image link

Published date : 16 Dec 2023 01:57PM

Photo Stories