SP Sarath Chandra Pawar: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం..
ఈ మేరకు ఆగస్టు 25న జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ మోహిన్ బాగ్ ప్రాంతానికి చెందిన షేక్ అలీమ్ అహ్మద్, ఎండీ. మినాజోద్దీన్ ఖాన్, ఎండీ. దానిష్.. నాలుగు సంవత్సరాల నుంచి హైదరాబాద్ మలక్ పేటలో ఎంఎస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నారు. నిరుద్యోగులకు వీసాలు ఇప్పించి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వరంగల్‌కు చెందిన హఫీజ్ (ఫ్రీ లాన్సర్)తో పరిచయం ఏర్పరుచుకున్నారు.
చదవండి: Fake Jobs: ఉద్యోగాల పేరిట సైబర్ మోసం
తద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాలకు చెందిన 25 మంది నిరుద్యోగుల నుంచి రూ. కోటి 8 లక్షలు వసూళ్లు చేశారు. ఒప్పందం ప్రకారం సంస్థ మూడు నెలల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కానీ నకిలీ సర్టిఫికెట్ అఫ్ స్పాన్సర్ షిప్ పత్రాలు రూపొందించి వారికి ఆన్‌లైన్‌లో పంపించారు. ఈ విషయాన్ని గ్రహించిన హఫీజ్.. ఎంఎస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నిర్వాహకులు నకిలీ పత్రాలు ఇచ్చారని బాధితులకు తెలిపారు.
చదవండి: Fake Jobs: ఆర్మీలో ఉద్యోగాల పేరిట రూ.6 కోట్ల టోకరా
అనంతరం మహబూబాబాద్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఎండీ.మినాజోద్దీన్ ఖాన్, ఎండీ. దానిష్‌ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ 4.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. షేక్ అలీమ్ అహ్మద్ పరారీలో ఉన్నాడు. నకిలీ వీసాల పేర్లతో విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే సంస్థలను నిరుద్యోగులు నమ్మొద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.
చదవండి: Fake Universities: ఆ 20 వర్సిటీలు నకిలీవి.. నకిలీ వర్సిటీలు ఇవే