Fake Jobs: ఆర్మీలో ఉద్యోగాల పేరిట రూ.6 కోట్ల టోకరా
నిందితుడిపై జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్, మూడవ టౌన్, ఐదోవ టౌన్ పరిధిలో కేసులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, కామారెడ్డి, హైదరాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని 400 మంది నుంచి రామకృష్ణ సుమారు రు. 6 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. 2017లో జిల్లా కేంద్రంలోని మాధవనగర్ వద్ద రామకృష్ణ విజేత డిఫెన్స్ అకాడమీ నిర్వహించేవాడు.
చదవండి: Fake Universities: ఆ 20 వర్సిటీలు నకిలీవి.. నకిలీ వర్సిటీలు ఇవే
ఈ ఆకాడమీలో కోచింగ్ తీసుకున్న వారు ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత వారి ఫొటోలను చూపించి తానే ఉద్యోగాలు ఇప్పించినట్లు ప్రచారం చేసుకుంటూ.. కొత్త గా కోచింగ్‌కు వచ్చిన వారి నుంచి డబ్బులు వసూ లు చేశాడు. నిరుద్యోగులు నిలదీస్తే నకిలీ అపాయింట్‌మెంట్ పత్రాలు చూపించి మాయమాటలు చెప్పివాడు.
ఉద్యోగాలు రాక పోవడంతో నిరుద్యోగులు మాక్లూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నార్త్‌రూరుల్ సీఐ సతీష్ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీఐ సతీష్‌ను సంప్రదించగా నిందితుడు నిరుద్యోగుల నుంచి రూ. లక్ష నుంచి రూ.4 లక్షల వరకు తీసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.