Skip to main content

Fake Jobs: ఉద్యోగాల పేరిట సైబర్‌ మోసం

సిరిసిల్లక్రైం: ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించి ఈజీ మనీ కోసం అడ్డదారిపట్టిన మోసగాడిని రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
Cyber ​​fraud in the name of jobs
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

 వేములవాడకు చెందిన మహిళ చేసిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఘరానా మోసగాన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. సిరిసిల్లలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అఖిల్‌మహాజన్‌ ఆగ‌స్టు 20న‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం రాజనాగారం గ్రామానికి చెందిన సలాది రాంగోపాల్‌ సివిల్‌ ఇంజినీర్‌ పూర్తి చేసి లేబర్‌ కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. సులభంగా డబ్బు సంపాధించాలన్న అత్యాశతో ప్రజలను మోసం చేసేందుకు ఉద్యోగాల పేరిట పత్రిక ప్రకటనలు ఇచ్చేవాడు. ప్రకటనలు చూసి నిరుద్యోగులు బయోడేటాను పంపించేవారు.

ఇంటర్వూలు ఉన్నాయంటూ వారి ఫోన్‌కు సమాచారం ఇస్తూ దోపిడీకి తెరలేపాడు. రామ్‌గోపాల్‌ సొంతంగా తయారు చేసిన నకిలీ అపాయింట్‌మెంట్‌ జాబ్‌ లెటర్స్‌ను ఫేక్‌మెయిల్‌ ద్వారా ఉద్యోగార్థులకు పంపించేవాడు. కాల్‌లెటర్‌పై ఉన్న ఫోన్‌నంబర్‌కు కాల్‌ చేస్తే ఉద్యోగం కావాలంటే మొదట రూ.50వేలు చెల్లించాలని మరో వ్యక్తి వసూలు చేసేవాడు. ఇలా ఇప్పటి వరకు రూ.1.20కోట్లు వసూలు చేశాడు. నేరుగా తన ఫోన్‌ నంబర్‌తో ఆర్థికలావాదేవీలు జరిపితే పట్టుబడతానని ముందస్తు జాగ్రత్తగా తనకు పరిచయవస్తుడు అయిన సిమ్‌కార్డులు విక్రయించే కోరువెల్లి రాజ్‌కుమార్‌ నుంచి ఇతరుల పేరిట సిమ్‌కార్డులు తీసుకుని వాటితో డబ్బులు మార్చుకునే వాడు.

చదవండి: Cyber ​​Crimes: సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం..రాష్ట్ర ఐటీ శాఖ 2022–23 నివేదిక విడుదల

ఆయుష్మాన్‌ భారత్‌ పేరిట మోసం

ఆయుష్మాన్‌ భారత్‌లోని పీఆర్వో పోస్టు ఉన్నట్లు ఫేక్‌ నోటిఫికేషన్‌ ఓ పేపర్‌లో చూసిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్‌కు చెందిన అ జ్మీర సునీతకు సమాచారం వచ్చింది. పూర్తి వివరా లకు 95155 59446లో సంప్రదించాలని ఉండడంతో అది నమ్మిన సునీత ఫోన్‌ చేయగా.. మొదట రూ.2.85 లక్షలు ఆన్‌లైన్‌లో తీసుకున్నాడు. అనంత రం ఎంత ప్రయత్నించిన ఉద్యోగం విషయం దాట వేస్తుండడంతో మోసపోయానని గ్రహించిన సునీత గత ఏప్రిల్‌లో వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సైబర్‌క్రైమ్‌ ఆర్‌ఎస్సై జునైద్‌, సి బ్బంది దర్యాప్తు చేపట్టగా.. నిందితులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించి ప్రత్యేక బృందా లుగా అక్కడికి వెళ్లారు. అక్కడి పోలీసులను సంప్రదించగా వీరిద్దరిపై పలు కేసులు ఉన్నాయని, ఇక్కడ ఉండడం లేదని వెల్లడించారు. మరింత లోతుగా వి చారణ చేపట్టగా నిందితులు రాంగోపాల్‌, రాజుకుమార్‌ వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆల య సమీపంలో సంచరిస్తున్నట్లు తెలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి రూ.1.60 లక్షల నగదు, కారు, 7 సిమ్‌కార్డులు, 3 ఫోన్లు, 6 బ్యాంక్‌ పాస్‌బుక్స్‌, 163 సిమ్‌కార్డులు, 7 చెక్కుబుక్స్‌ సీజ్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. సైబర్‌ నే రాన్ని ఛేదించిన సిరిసిల్ల సైబర్‌ క్రైం ఆర్‌ఎస్‌ఐ జునై ద్‌, రాజాతిరుమలేశ్‌, వేములవాడటౌన్‌ ఎస్సై రమే శ్‌, రజనీకాంత్‌కు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ రివార్డులు అందించారు.

Published date : 21 Aug 2023 03:56PM

Photo Stories