Skip to main content

Jobs In Post Office: పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

Postal Department Employment Opportunities  Suryapet Post Office Recruitment Interviews  Commission-based Postal Job Interviews  Jobs In Post Office   Postal Life Insurance Interview Announcement Suryapet Division Postal Department Interviews

భానుపురి (సూర్యాపేట) : తపాలా శాఖలో కమిషన్‌ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు ఈనెల 18న సూర్యాపేట పోస్టాఫీస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సూర్యాపేట డివిజన్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ జి. సైదులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట డివిజన్‌లోని 347 పోస్టాఫీసుల పరిధిలో 18 ఏళ్లు నిండి 10వ తరగతి ఉత్తీర్ణులైనవారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Civils Free Coaching: సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఎంపికై న వారు డివిజన్‌ పరిధిలో ఎక్కడైనా పనిచేసేందుకు అర్హులని తెలిపారు. సుమారు 100 మందికిపైగా ఏజెంట్లను నియమిస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు ఎస్‌ఎస్‌సీ మెమో, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు సూర్యాపేట హెడ్‌ పోస్టాఫీస్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.

Posts at TSPSC : టీఎస్‌పీఎస్సీలో ఈ రెండు పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

మిర్యాలగూడ హెడ్‌ పోస్టాఫీస్‌ పరిధిలోనివారు ఈ నెల 19న ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9985392675 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
 

Published date : 10 Jul 2024 12:31PM

Photo Stories