Fake Jobs: రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం
Sakshi Education
విజయనగరం క్రైమ్: రైల్వేశాఖలో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి కుటుంబ సభ్యుల వద్ద లక్షల రూపాయలు మింగేసిన వారిపై ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు అక్టోబర్ 19న కేసు నమోదు చేశా రు.
కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన వాకాడ పూజకు వరసకు పెద్దమ్మ, అయిన జోగి సూర్యకాంతం, ఆమె కుమారుడు హరికృష్ణ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని పూజ, వారి కుటుంబ సభ్యులను నమ్మబలికి తల్లీకొడుకులు దపదఫాలుగా వారి నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నారు.
చదవండి: YS Avinash Reddy: ఆర్టీపీపీలో ఉద్యోగాలిప్పిస్తామంటే నమ్మవద్దు
రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్యోగం లేకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితురాలు పూజ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు వన్‌టౌన్ ఎస్సై భాస్కరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published date : 20 Oct 2023 03:13PM