APPSC Group-1 Ranker Success Story: మా మామకు ఇచ్చిన మాట కోసమే.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..

నాలుగేళ్లుగా సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్‌ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ కమిషన్ ఎట్ట‌కేల‌కు ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఇటీవ‌లే ప్ర‌క‌టించింది.
కురుబ మధులత, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 రాష్ట్ర‌స్థాయిలో 7వ ర్యాంకర్‌

2018 గ్రూప్‌–1కు సంబంధించి మొత్తం 167 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. వాటిలో కోర్టు సూచనలతో 2 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు, తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేనందున మరో 2 పోస్టులు భర్తీ చేయలేదు. మొత్తం 163 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. వీరిలో 67 మంది మహిళలు కాగా 96 మంది పురుషులున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1 ఫ‌లితాల్లో రాష్ట్ర‌స్థాయిలో 7వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ అయిన‌ కురుబ మధులత స‌క్సెస్ స్టోరీ మీకోసం..

APPSC Group 1 Ranker Success Story : ఈ ల‌క్ష్యం కోస‌మే చ‌దివా.. అనుకున్న‌ట్టే.. డిప్యూటీ కలెక్టర్ కొట్టానిలా..

కుటుంబ నేప‌థ్యం :
మాది అనంతపురం జిల్లా. తండ్రి నాగానందం, తల్లి లక్ష్మీదేవి. 

APPSC Group 1 Ranker Success Story : నా ఫోన్‌తోనే.. గ్రూప్‌-1 ర్యాంక్ కొట్టానిలా.. ఎలా అంటే..?

ఇచ్చిన మాట కోసం..
బీఎస్సీ నర్సింగ్‌ చేశాక 2013లో గ్రూప్‌–4కి ఎంపికయ్యాను. ప్రస్తుతం అనంతపురం కలెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ పనిచేస్తున్నా. ఇప్పుడు గ్రూప్‌–1 రాసి డిప్యూటీ కలెక్టర్‌ కావడం ఆనందంగా ఉంది. ఎలాగైనా నేను విజయం సాధించాలని మా మామ గుండ్లమడుగు శివయ్య మాట తీసుకున్నారు. ఆయనకు ఇచ్చిన మాట కోసం, నా భర్త, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో కష్టపడి చదవాను.

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

టాప్‌–10 ర్యాంక్‌లో.. మహిళలదే హావా..
గ్రూప్‌–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలు ఉన్నారు. ఈ గ్రూప్‌-1 పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలే ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారే. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారు.  అలాగే ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారు. 55 మంది ఎంటెక్‌ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో 9 మంది సివిల్‌ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారు.

Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

#Tags