Skip to main content

APPSC Group 1 Ranker Success Story : నా ఫోన్‌తోనే.. గ్రూప్‌-1 ర్యాంక్ కొట్టానిలా.. ఎలా అంటే..?

నాలుగేళ్లుగా సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గ్రూప్‌-1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశ‌లు ఫ‌లించాయి.
APPSC Group -1 Ranker
APPSC Group -1 Ranker Mahesh

ఎట్ట‌కేల‌కు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికైన మహేష్‌ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టారు. లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. మొక్కవోని దీక్షతో డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి ఎదిగారు. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని నిరూపించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నగరికి చెందిన మహేష్‌ అలకాటూరు. 

Success Story: ఓకే సారి గ్రూప్‌-2కు తండ్రీ కొడుకులు సెలక్ట్‌.. వీరి స‌క్సెస్ సిక్రెట్ చూస్తే..

కుటుంబ నేప‌థ్యం :
చిత్తూరు జిల్లా నగరి మండలంలోని నంబాకం గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, సరోజమ్మ దంపతుల కుమారుడు మహేష్‌. గ్రూప్‌–1 పరీక్షలో ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్‌గా అర్హత సాధించి అందరిచేత మన్ననలు అందుకున్నారు. మహేష్‌ భార్య స్వాతి నగరి మున్సిపాలిటీ, కాకవేడు సచివాలయంలో అడ్మిన్‌గా ప‌ని చేస్తున్నారు.

Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

ఎడ్యుకేష‌న్ :
నంబాకం ప్రభుత్వ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన ఈయన 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రైవేటు కళాశాలల్లో చదువుకున్నారు. 2011లో వెంకటేశ్వర యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌  పూర్తి చేశారు. 2013లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు.

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లోని మెటీరియల్‌నే చ‌దివి..
కలెక్టర్‌ కావాలన్న చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు సివిల్స్‌కు తర్ఫీదయ్యారు. 2016లో సివిల్స్‌ రాసినా మెయిన్స్‌ క్లియర్‌ కాలేదు. లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్న తక్కువ సమయంలో ఏకాగ్రతతో పట్టు వదలకుండా సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లోని మెటీరియల్‌నే చదివారు.  2018లో సివిల్స్‌ పరీక్ష రాశారు. అయితే కోర్టు వివాదాల కారణంగా నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఇంతలో 2022లో సత్యవేడు పాలిటెక్నిక్‌ కళాశాలకు బదిలీపై వెళ్లారు. ఇటీవ‌ల‌ విడుదలైన ఫలితాల్లో మహేష్‌ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు.

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

బేసిక్స్‌పై పట్టు సాధించా.. ఉద్యోగం సాధించా.. 
సాధించాలన్న తపన ఉంటే తప్పక సివిల్స్‌లో మంచి ఫలితాలు పొందవచ్చు. లెక్చరర్‌గా పనిచేస్తూనే ఉన్న సమయంలో ఆన్‌లైన్‌లో ఎన్‌సీటీ మెటీరియల్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని చదివారు. అలాగే ఆన్‌లైన్‌లో ఇగ్నో పుస్తకాలు, ప్రీమెటీరియల్స్‌ సివిల్స్‌లో రాణించడానికి ఎంతో ఉపయోగపడింది. చేతిలోని ఫోన్‌ నాకు మెటీరియల్‌గా మారింది. నిరంతర సాధన, ఏకాగ్రత ఉండి బేసిక్స్‌పై పట్టు పెంచుకుంటే సివిల్స్‌లో రాణించవచ్చు. న్యూస్‌ రీడింగ్‌ తప్పనిసరి. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుని నా వెన్నంట ఉన్న భార్య స్వాతి అందించిన సహకారం, ప్రోత్సాహం నా విజయానికి ఎంతో ఉపయోగపడింది.

Success Story: గ్రూప్‌-1లో టాప్ ర్యాంక్‌ కొట్టానిలా..

Published date : 07 Jul 2022 04:17PM

Photo Stories