TSPSC Group 1 Candidates Problems : గ్రూప్‌-1 గోవిందా.. నా పెళ్లి గోవిందా.. ఇప్పుడ నా ప‌రిస్థితి ఏమిటి గోవిందా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప‌రీక్ష రెండో సారి కూడా ర‌ద్దు అవ్వ‌డంతో.. అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
TSPSC Group 1 Candidates Problems

గ్రూప్‌-1 ప‌రీక్ష రాసిన అభ్యర్థుల బాధ‌లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఉద్యోగం కొట్టాలన్న కసితో ఏళ్ల తరబడిగా చదువుతున్న ఎంతోమంది నిరుద్యోగులు గ్రూప్‌–1 రెండు సార్లు రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాము కష్టపడి చదివి ఉద్యోగం వస్తుందనుకుంటే ఇలా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

☛ Sakshieducation.com WhatsApp Channel కోసం క్లిక్ చేయండి

క్వాలిఫై అవుతామన్న ధీమాతో చాలామంది..
కామారెడ్డి జిల్లా లైబ్రరీలో రెండుమూడేళ్లుగా గ్రూప్‌–1 కోసం నాలుగైదు వందల మంది ప్రిపేర్‌ అవుతున్నారు. ఇందులో యాభై మందికిపైగా క్వాలిఫై అవుతారని భావించారు. కానీ పరీక్ష రద్దవడంతో వారంతా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నత ఉద్యోగాల మీద ఆశతో ఏళ్లపాటు పుస్తకాలతో కుస్తీలు పట్టారు. కోచింగ్‌కు వెళ్లారు. కష్టపడి చదివి గ్రూప్‌–1 రాశారు. క్వాలిఫై అవుతామన్న ధీమాతో చాలామంది ఉన్నారు. అయితే పేపర్‌ లీకవడంతో పరీక్షను రద్దు చేసినట్టు సెప్టెంబ‌ర్ 23వ తేదీన (శనివారం) ప్రకటన వెలువడడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

☛ TSPSC : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై అప్పీల్‌కు వెళ్లినా..

గదులు అద్దెకు తీసుకుని..

పరీక్షకు సన్నద్ధం కావడం కోసం చాలామంది గ్రామీణ నిరుద్యోగులు జిల్లాల‌ కేంద్రానికి వచ్చి గదులు అద్దెకు తీసుకుని, కోచింగ్‌కు వెళ్లారు. పలువురు రాష్ట్ర రాజధానిలో కోచింగ్‌ తీసుకున్నారు. పొద్దంతా లైబ్రరీలలో గడిపిన అభ్యర్థులు.. రాత్రిళ్లలో గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టారు. చాలామంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల మీద ఆశతో చదువుతూనే ఉన్నారు. గ్రూప్‌–1 టార్గెట్‌గా చాలామంది రేయింబవళ్లు కష్టపడ్డారు. కొందరైతే పండుగలు, పబ్బాలు కూడా మరిచిపోయి మరీ చదివారు.

☛➤ టీఎస్‌పీఎస్సీ Group 1 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

తెలంగాణ వచ్చాక తొలిసారి పరీక్ష బాగా రాసి క్వాలిఫై అయిన వారు పేపర్‌ లీకైంద‌ని తెలిసి షాక్‌కు గురి అయ్యారు. వారు తేరుకునేందుకు కొంత సమయం పట్టింది. ఎలాగైనా ఉద్యోగం కొట్టాలన్న పట్టుదలతో మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టారు. రెండోసారి పరీక్ష రాసి, కీ చూసుకున్నాక క్వాలిఫై అవుతామన్న నమ్మకంతో ఉన్నవారు రిజల్ట్‌ కోసం వేచిచూస్తున్నారు. అయితే పరీక్ష నిర్వహణలో లోపాలపై కొందరు కోర్టును ఆశ్రయించడం, కోర్టు పరీక్షను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో మళ్లీ ఆశలు ఆవిరయ్యాయి. గ్రూప్‌–1 నిర్వహణ విషయంలో ప్రభుత్వం సరైన విధానాలు అవలంబించకపోవడంతో ఇబ్బందిపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో కష్టాలు పడ్డా.. ఖర్చుల కోసం.. : సంతోష్‌, గ్రూప్‌–1 అభ్యర్థి

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా కొట్టాలన్న పట్టుదలతో చదివాను. ఖర్చుల కోసం రెండేళ్లు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేశా. రెండేళ్లుగా కామారెడ్డిలో అద్దె గదిలో ఉంటూ ప్రిపేర్‌ అవుతున్నా. మొదటిసారే క్వాలిఫై అయ్యా.. అప్పుడు పేపర్‌ లీకై రద్దయ్యింది. ఎన్నో కష్టాలకు ఓర్చి రోజూ లైబ్రరీకి వెళ్లి ప్రిపేర్‌ అయ్యా. మరోసారి పరీక్ష రద్దు చేయడంతో మళ్లీ నిరాశే ఎదురైంది.

ఈసారి ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని.. : రాజశేఖర్‌, గ్రూప్‌–1 అభ్యర్థి

కామారెడ్డి పట్టణంలో రూం కిరాయికి తీసుకుని రెండేళ్లుగా గ్రూప్‌–1కు ప్రిపేర్‌ అవుతున్నా. తొలిసారి గ్రూప్‌–1 పరీక్ష నిర్వహించినప్పుడే క్వాలిఫై అయ్యాను. ఉద్యోగం పక్కా అనుకున్నా. పేపర్‌ లీకవడంతో పరీక్ష రద్దయ్యింది. ఈసారి ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని కష్టపడ్డాను. కీ చూసుకుంటే మంచి మార్కులే వచ్చాయి. పరీక్ష నిర్వహణ లోపాలతో రద్దు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించడంతో కష్టం అంతా వృథా అయ్యింది.

☛➤ TSPSC Group 1 Prelims- 2023 Exam Question Paper with Key (Click Here)

అప్పులు చేసి.. గ్రూప్‌-1కు..
తెలంగాణ‌లో చాలామంది నిరుద్యోగులు గ్రూప్‌–1 కోసం అప్పులు చేసి కోచింగ్‌లకు వెళ్లారు. పుస్తకాలు కొన్నారు. ఏళ్లుగా అద్దె గదుల్లో ఉంటూ చదువు తున్నారు. ఒక్కో నిరుద్యోగి కోచింగ్‌, పుస్తకాలు, రూం అద్దె, ఉండడానికి అయ్యే ఖర్చులన్నీ కలిపి కనీసం రూ.2 లక్షల దాకా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

☛➤ Competitive Exams: పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌వుతున్నారా... అయితే ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి

పెళ్లిని కూడా వాయిదా.. 
కొందరు గ్రూప్‌–1 రిజల్ట్‌ తర్వాతే పెళ్లి చేసుకుందామని పెళ్లిని వాయిదా వేసుకున్నారు. మరికొందరు పైళ్లెనా కుటుంబాన్ని ఇంటి వద్దే వదిలేసి పట్టణాల్లో ఉంటూ చదువుతున్నారు. కనీసం పండుగలకు కూడా దుస్తులు కొనుక్కోకుండా పుస్తకాలకు ఖర్చు చేశామని ఓ నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెలల తరబడి ఇంటి ముఖం చూడకుండా చదివానని, పరీక్ష రద్దు చేయడంతో నిరాశ చెందానని మరో నిరుద్యోగి పేర్కొంటున్నాడు.

#Tags