World Para Championships: ప్రపంచ రికార్డుతో పసిడి పతకం సాధించిన తెలంగాణ అమ్మాయి!

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన దీప్తి జివాంజి 400 మీటర్ల (టి20 కేటగిరీ) పరుగులో స్వర్ణ పతకం సాధించింది.

ప్రపంచ రికార్డుతో ఆమె స్వర్ణం సొంతం చేసుకుంది. మే 20వ తేదీ జరిగిన ఈ పోటీలో దీప్తి 55.07 సెకన్లలో గుర్తుంచుకోదగిన ప్రదర్శనతో పరుగు పూర్తి చేసి, గత ఏడాది ఈ ఈవెంట్‌లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును (55.12 సెకన్లు) బద్దలు కొట్టారు.

పేదరికం నుంచి పైకెగసి.. 
దీప్తి స్వస్థలం వరంగల్‌ జిల్లా కల్లెడ. పేద కుటుంబానికి చెందిన ఆమె తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. చిన్నతనంలోనే బుద్ధిమాంద్యం ఉన్న అమ్మాయిగా ఊరిలో అందరూ ఆమెను హేళన చేసేవారు. ఈ కష్ట సమయంలో భారత అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ ఆమెకు అండగా నిలిచి, ఆమెలోని అద్భుత ప్రతిభను గుర్తించారు.

Manika Batra: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. తొలిసారి ఇలా!

ఒక స్కూల్‌ మీట్‌లో దీప్తి రన్నింగ్‌ ప్రతిభ గురించి తెలుసుకున్న రమేశ్‌, ఆమెను హైదరాబాద్‌కు తీసుకువెళ్లి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు.

ఆరంభంలో దీప్తికి మానసికంగా కొంత బలహీనత ఉండటంతో శిక్షణ ఇవ్వడంలో రమేశ్‌కి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా ‘మైత్రా ఫౌండేషన్‌’తో కలిసి దీప్తికి ఆర్థిక సహాయం అందించారు.

తన ప్రతిభతో దీప్తి అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్‌ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్‌–18 చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2021 సీనియర్‌ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్‌ పోటీల బరిలోకి దిగింది.

 

Federation Cup 2024: ఫెడరేషన్ కప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు బంగారు జోరు!

#Tags