Simona Halep: ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రొమేనియా స్టార్
Sakshi Education
మాజీ ప్రపంచ నంబర్‌వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్ సిమోనా హాలెప్ (రొమేనియా) కెరీర్‌కు వీడ్కోలు పలికింది.

డోపింగ్ సస్పెన్షన్‌తో పాటు గాయాల కారణంగా చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న 33 ఏళ్ల హాలెప్.. ఫిబ్రవరి 5వ తేదీ ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన హాలెప్.. టాన్సిల్వేనియా ఓపెన్ తొలి రౌండ్‌లో పరాజయం ఆనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించింది.
2017లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన హాలెప్... ఆ తర్వాత గాయాలు, నిషేధం కారణంగా 870వ ర్యాంక్‌కు పడిపోయింది.
Published date : 08 Feb 2025 08:49AM