Skip to main content

Manika Batra: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన మనిక బాత్రా..!

ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌లో టాప్‌–25లో నిలిచిన భారతీయ క్రీడాకారిణిగా మనిక బత్రా ఘనత సాధించింది.
Paddler Manika Batra Reaches Career-High Ranking Of World No 24

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రా మరో మైలురాయిని దాటి, కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మే 14వ తేదీ విడుదలైన ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె 24వ ర్యాంక్‌కు చేరుకుంది.

ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా మనిక చరిత్ర సృష్టించింది. గత వారం సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంతో ఆమె ర్యాంకింగ్‌లో 14 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌ నుంచి 24వ ర్యాంక్‌కు చేరుకుంది.

Federation Cup 2024: ఫెడరేషన్ కప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు బంగారు జోరు!

మిగతా క్రీడాకారుల ర్యాంకులు ఇలా..
గతవారం 38వ ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు పడిపోయి 41వ ర్యాంక్‌కు చేరుకోగా.. యశస్విని రెండు స్థానాలు పడిపోయి 99వ ర్యాంక్‌లో నిలిచింది.

పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ఆచంట శరత్‌ కమల్‌ 40వ ర్యాంక్‌లో, మానవ్‌ ఠక్కర్‌ 62వ ర్యాంక్‌లో, హర్మీత్‌ దేశాయ్‌ 63వ ర్యాంక్‌లో, సత్యన్‌ 68వ ర్యాంక్‌లో ఉన్నారు. 

Chess Grandmaster: 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించి.. గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన చెస్‌ ప్లేయర్ ఇత‌నే..!

Published date : 15 May 2024 02:09PM

Photo Stories