National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణకు తొలి స్వర్ణం

డెహ్రాడూన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో ఫిబ్రవరి 4వ తేదీ మహిళల బాస్కెట్‌బాల్ 3X3 ఈవెంట్‌లో తెలంగాణ జట్టు తొలి స్థానంలో నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 21–11 పాయింట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. పసిడి పతకం సాధించిన మహిళల జట్టులో గులాబ్ షా అలీ, ఎస్.పుష్ప, కేబీ హర్షిత, పి.ప్రియాంక సభ్యులుగా ఉన్నారు. మూడో స్థానం పోరులో తమిళనాడును 14-12 తేడాతో ఓడించి మధ్యప్రదేశ్ కాంస్యం సాధించింది.
పురుషుల బాస్కెట్‌బాల్ 3X3 ఈవెంట్‌లో మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నాయి. తెలంగాణ 4వ స్థానంతో సరిపెట్టుకుంది.
National Games: జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల మహిళలకు కాంస్య పతకాలు
ఆంధ్రప్రదేశ్‌కు మూడు కాంస్యాలు
ఏపీకి ఫిబ్రవరి 4వ తేదీ మూడు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కర్రి సాయిపవన్–షేక్ గౌస్ జోడీ.. కనోయింగ్–కయాకింగ్ క్రీడాంశంలోని పురుషుల స్లాలోమ్–కే1 ఈవెంట్‌లో కొల్లకాని విష్ణు.. మహిళల స్లాలోమ్–సీ1 ఈవెంట్‌లో దొడ్డి చేతన భగవతి కాంస్య పతకాలు సాధించారు.
బ్యాడ్మింటన్ డబుల్స్ సెమీఫైనల్లో సాయిపవన్–షేక్ గౌస్ ద్వయం 13–21, 12–21తో నితిన్–ప్రకాశ్ రాజ్ (కర్ణాటక) జంట చేతిలో ఓడి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. ఫిబ్రవరా 4వ తేదీ పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ ఆరు పతకాలతో 21వ స్థానంలో, మూడు పతకాలతో తెలంగాణ 24వ స్థానంలో ఉన్నాయి.
Tata Steel Chess Masters: గుకేశ్‌ను ఓడించి.. ఛాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞానంద