New DGP of Telangana: తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్
తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జితేందర్. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్. తెలంగాణలో మొదట నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా జితేందర్ విధులు నిర్వహించారు. ఇక, 2025 సెప్టెంబర్‌లో జితేందర్ పదవీ విరమణ చేయనున్నారు. కాబట్టి మరో 14 నెలల పాటు ఆయన డీజీపీగా విధులు నిర్వర్తించనున్నారు.
ప్రస్తుతం డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా జితేందర్ ఉన్నారు. అలాగే, విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ డీజీగా ఆదనపు బాధ్యతలు కూడా జితేందర్ నిర్వర్తిస్తున్నారు. గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది.
అలాగే.. రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Mahesh Chandra Laddha: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేష్ చంద్ర లడ్హా
#Tags