Mahesh Chandra Laddha: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేష్ చంద్ర లడ్హా
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్హాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈయన 1998 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. నాలుగేళ్లుగా డెప్యూటేషన్ మీద కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపంపై కేంద్ర హోం శాఖ ఆయన్ను ఇటీవలే రాష్ట్ర సర్వీసులకు తిరిగి పంపింది.
ఈ నేపథ్యంలో మహేశ్ చంద్ర లడ్హాను రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ జులై 2వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు.
Indian Army: చరిత్రలో మొదటిసారి ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా క్లాస్‌మేట్స్
Published date : 04 Jul 2024 09:59AM