Official Clarification on Group 2 Fake News : గ్రూప్-2 పరీక్షపై ఫేక్ న్యూస్ నమ్మోద్దు.. ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన..

సాక్షి ఎడ్యుకేషన్: గ్రూప్-2 మెయిన్ పరీక్షలు రేపు అంటే.. ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనుంది ఏపీపీఎస్సీ. ఇప్పటికే, ఇందుకు సంబంధంచి హాల్‌టికెట్లను కూడా విడుదల చేసింది బృందం. అయితే, ఈ పరీక్షలు రేపు జరగడం లేదని, వాయిదా పడ్డాయిని, రేపు జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇక, ఈ విషయాలేవి నిజం కాదని, అభ్యర్థులంతా ఆందోళన చెందవద్దని, రేపు ప్రకటించిన సమయానికే గ్రూప్-2 పరీక్ష నిర్వహణ ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేస్తూ అధికారికంగా ప్రకటించింది.
ఫేక్ న్యూస్..
రేపు.. ఫిబ్రవరి 23న జరగాల్సిన గ్రూప్-II సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ (నోటిఫికేషన్ నం. 11/2023) వాయిదాకు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాపించే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారికంగా ధృవీకరించింది (FN & AN). రోస్టర్ కరెక్షన్‌కు సంబంధించి పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుండి డిమాండ్లు ఉన్నాయి.
APPSC Group 2 Exam : ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల వాయిదాపై హైకోర్టు వ్యాఖ్యలు..
వాయిదా కాదు..
ఇప్పటివరకు పరీక్షలు వాయిదా వేసినట్లు ఎలాంటి ప్రకటన రాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షలు ముందుగా ప్రకటించిన విధంగానే కొనసాగుతుందని, హాల్‌టికెట్లలో ప్రకటించిన వివరాల అనుసారంగానే పరీక్షను నిర్వహిస్తారని వివరించారు. అంతేకాకుండా, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు పోలీసు ఫిర్యాదు నమోదు చేశామని అధికారికంగా తెలిపారు.
యథావిధిగా..
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 23వ తేదీ
పరీక్షల సమయం: పేపర్ 1: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.
పేపర్ 2: మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు.
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ విధానం:
1. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.. psc.ap.gov.in
2. డౌన్‌లోడ్ హాల్‌టికెట్‌పై క్లిక్ చేయండి.
3. ఓటీపీఆర్ ఐడీ, పాస్‌వర్డ్, కాప్ట్‌చా (OTPR ID, Password, and Captcha) నమోదు చేయండి.
4. లాగిన్‌పై క్లిక్ చేయండి. ఇక మీ హాల్‌టికెట్ మీకు కనిపిస్తుంది. దానిని క్షుణ్ణంగా పరిశీలించి, డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోండి. ఈ ప్రింట్ హాల్‌టికెట్‌ను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడం తప్పనిసరి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- APPSC Group 2 Exam
- appsc clarity
- no postpone of group 2 exam
- fake news clarity
- Government Jobs
- ap government exams
- Competitive Exams
- appsc group 2 main exam 2025 clarity
- no postponement
- official announcement of appsc authorities on group 2 exam postponement
- Group 2 Exam Fake Postponement
- appsc group 2 fake news alert
- alert news for appsc group 2 candidates
- fake news on appsc group 2 exam postpone
- fake news alert
- AP government
- govt job exams
- Exams 2025
- competitive exams 2025
- march exams 2025 latest news in telugu
- Education News
- Sakshi Education News