Success Story: 23 ఏళ్ల‌కే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు... వంశీకృష్ణ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఏదైనా సాధ్యమని ఆ యువకుడు నిరూపించాడు. తన గమ్యమైన సమాజ సేవ చేయాలన్న ఆశయానికి సరైన సోపానం వేసుకున్నాడు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అతడు స్వీయ శిక్షణతోనే తొలి ప్రయత్నంలో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యాడు.
వంశీకృష్ణను అభినందిస్తున్న ఏయూ వీసీ ప్రసాదరెడ్డి

అతనే ఏయూ న్యాయ కళాశాల విద్యార్థి మజ్జి వంశీకృష్ణ. అతని నేపథ్యం గురించి తెలుసుకుందాం.. 

వంశీకృష్ణ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం గ్రామం. ప్రాథమిక, ఇంటర్‌ విద్య శ్రీకాకుళంలో పూర్తిచేశాడు. ఇంటర్‌లో 983 మార్కులు సాధించినా ఇంజనీరింగ్‌ విద్య వైపు మనసు మళ్లలేదు. కొంత భిన్నంగా చదవాలనే ఉద్దేశంతో న్యాయ విద్యను ఎంపిక చేసుకున్నాడు. 

చ‌ద‌వండి: 36 ల‌క్ష‌ల వేత‌నాన్ని వ‌దిలేసి సివిల్స్ వైపు అడుగులు... వ‌రుస‌గా మూడు ప్ర‌య‌త్నాల్లో ఫెయిల్‌... చివ‌రికి స‌క్సెస్ సాధించానిలా

తల్లిదండ్రులు సూరిబాబు, వెంకట లక్ష్మి స్వగ్రామంలో టైలర్‌ వృత్తిలో కొనసాగుతున్నారు. ఏపీ లాసెట్‌లో రాష్ట్ర స్థాయిలో నాల్గో ర్యాంక్‌ సాధించి ఏయూలో ప్రవేశం పొందాడు. ఇక్కడ 69 శాతం మార్కులతో ఐదేళ్ల న్యాయ విద్యను విజయవంతంగా పూర్తి చేశాడు. గ్రామీణ నేపథ్యం కలిగిన మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వంశీకృష్ణ స్కాలర్‌షిప్‌పైనే చదువును పూర్తిచేశాడు.

న్యాయాధికారుల ప్రసంగాలే స్ఫూర్తి
చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఏయూ న్యాయ కళాశాల నుంచి ఎందరో న్యాయాధికారులుగా ఎదిగారు. నేటి తరానికి వారి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం వివిధ స్థానాల్లో స్థిరపడిన న్యాయాధికారులతో ప్రత్యేక ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు. వీటిని వినడం అలవాటుగా చేసుకున్న వంశీకృష్ణ వాటి నుంచి స్ఫూర్తిని పొందారు. ఆ ప్రసంగాలు వంశీకృష్ణ న్యాయమూర్తిగా అయ్యే విధంగా మలిచాయి.

చ‌ద‌వండి: 16 ఏళ్ల‌కే వినికిడి శ‌క్తి కోల్పోయా... కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే ఐఏఎస్ సాధించానిలా...

ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు
జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షకు ఎటువంటి ప్రత్యేక శిక్షణ వంశీకృష్ణ తీసుకోలేదు. ఏయూ న్యాయ కళాశాలలో అందించిన ప్రత్యేక అవగాహన తరగతులకు మాత్రమే హాజరయ్యాడు. సొంతంగా సిలబస్‌కు అనుగుణంగా సన్నద్ధమయ్యాడు. ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే సొంతంగా చదువుకొని తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ప్రిలిమినరీ, మెయిన్స్‌లో విజయం సాధించి ఇంటర్వ్యూను సైతం ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు.

చ‌ద‌వండి: IFS  Telugu Topper కొల్లూరు వెంకట శ్రీకాంత్‌ Success Story

రోజుకు 14 గంటలు ప్రిపరేషన్‌
జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షకు ప్రణాళిక సిద్ధం చేసుకొని రోజుకు 14 గంటలు ప్రిపరేషన్‌కి కేటాయించినట్లు 23 ఏళ్ల వంశీకృష్ణ తెలిపాడు. తన దినచర్యను ఉదయం 4 గంటలకు ప్రారంభించి రాత్రి 10.30కి ముగించినట్లు చెప్పాడు. కఠోర శ్రమే మంచి ఫలితాన్ని అందించింది.

#Tags