Skip to main content

Success Story : ఈ మూడు పాటించా... ఒకే సారి మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

ప్ర‌స్తుత రోజులు ఒక ఉద్యోగం వ‌స్తే చాలు.. లైఫ్ సెట్ అవుతుంద‌నే ఆలోచ‌న‌లో ఎంతో మంది యువ‌త ఉన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగం వ‌స్తే.. వీరి ఆనందంకు అవ‌ధులు ఉండ‌వ్‌.
నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు అభినందనలు

ఉట్నూర్‌లో సెలూన్‌ షాప్‌ నిర్వాహకుడు గంగాధర్‌ కుమారుడు ఉదయ్‌కుమార్‌ చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తితో... ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి ప్ర‌భుత్వ ఉద్యోగంను కొట్టాడు. ఈ నేప‌థ్యంలో ఉదయ్‌కుమార్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం...

గ్రూప్‌–4 పరీక్షలు రాసి ఏఈఈలో 159 ర్యాంక్‌, పాలిటెక్నిక్‌ లె క్చరర్‌లో 166వ ర్యాంక్‌, ఏఈలో 366వ ర్యాంకు సాధించి మూడు కొలువు సాధించాడు. ఇష్టపడి చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చునని, తనను చదివించిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటానని ఉదయ్‌కుమార్‌ తెలిపాడు. ఉదయ్‌కుమార్‌కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు. ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను సన్మానించారు.

మూడు ప్రభుత్వ ఉద్యోగాల‌ను..
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని చించర్‌వాడ కాలనీకి చెందిన ముత్యాల సాయికృష్ణ 2018లో గ్రూప్‌–4 పరీక్షలో సత్తాచాటి ఆసిఫాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2022లో మళ్లీ గ్రూప్‌–4 పరీక్ష రాసి ర్యాంకు సాధించాడు. గత ఆగస్టులో కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పట్టుదలతో చదివి మూడు ప్రభుత్వ కొలువులు సాధించాడు. 

సాయికృష్ణ తల్లిదండ్రులు పొచ్చన్న–రూప. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌లో అసిస్టెంట్‌ ఎనలైటిక్‌ అధికారిగా ఉద్యోగంలో చేరుతానని సాయికృష్ణ తెలిపారు.

Published date : 16 Sep 2024 05:46PM

Photo Stories