IAS Success Story: జస్ట్ పాస్ మార్కులతో పది పాసయ్యా... కట్ చేస్తే ఇప్పుడు కలెక్టర్‌గా సేవలందిస్తున్నా.. నా సక్సెస్ జర్నీ ఇదే
అలాగే పది, ఇంటర్‌లో తక్కువ మార్కులు వస్తే ఇక జీవితం ముగిసిపోయిందని ఫీల్ అవుతూ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు కూడా మనం చూస్తునే ఉన్నాం.
ఇవీ చదవండి: అఖిల భారత సర్వీసుల్లో 3,400 ఖాళీలు...!
పై రెండు ఘటనలు ఒక విద్యార్థి విజయాన్ని అడ్డుకోలేవని ఓ ఐఏఎస్ అధికారి మార్కులు చూస్తే అర్థమవుతోంది. జస్ట్ పాస్ మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడైన ఆయన.. కట్ చేస్తే ఇప్పుడు ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవచేస్తున్నారు. ఆయనే తుషార్ సుమేరా.
సహ ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్.. సుమేరా 10 వ తరగతి మార్కుల సర్టిఫికెట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మీ మార్కులు మిమ్మల్ని, మీ భవిష్యత్తును నిర్ణయించలేవని పేర్కొంటూ.. మార్క్స్ లిస్ట్‌ను పోస్ట్ చేశారు. సుమేరా 10వ తరగతి మార్కులను గమనిస్తే 35 మార్కులతో ఇంగ్లిష్ పాసయ్యారు. మ్యాథ్స్‌లో పాస్ మార్కులకంటే ఒక మార్కు ఎక్కువగా తెచ్చుకున్నాడు. ఇక సైన్స్‌లో 38 మార్కులు సాధించాడు.
ఇవీ చదవండి: ప్రభుత్వ బడుల్లో చదువుకుని మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించా... దివ్య తన్వర్ సక్సెస్ జర్నీ సాగిందిలా
పదో తరగతిలో ఆయనకు కేవలం 49 శాతం మార్కులే వచ్చాయి. 1997లో ఆయన పదో తరగతి పాసయ్యారు. ఇంటర్, డిగ్రీలలో ఆర్ట్స్ తీసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్కూల్ టీచర్‌గా కూడా కొంతకాలం పనిచేశాడు. విద్యార్థులకు పాఠాలు చెబుతూనే సివిల్స్‌కు ప్రిపేరయ్యేవారు.
కట్ చేస్తే.. 2012లో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తర్వాత గుజరాత్‌లోని భరూచ్ కలెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు.
విద్యార్థులు ఇప్పటికైనా మార్కులు తక్కువగా వచ్చాయని బాధపడడం ఆపేయండని ట్విటర్ వేదికగా నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మార్కులు ప్రతిభకు కొలబద్ధకాదన్న విషయాన్ని తుషార్ సుమేరా మార్కులను చూస్తే అర్థమవుతుంది.
ఇవీ చదవండి: నాలుగో ప్రయత్నంలోనే ఐపీఎస్... ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్... నా సక్సెస్ జర్నీ ఇదే