Civil Service vacancies: అఖిల భారత సర్వీసుల్లో 3,400 ఖాళీలు...!
సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ప్రతీ ఏడాది యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాది భర్తీ చేస్తున్న ఖాళీల కంటే రిటైర్డ్ అయ్యే అధికారులు కూడా సమానంగా ఉంటుండడంతో ఖాళీల భర్తీలో వ్యత్యాసం ఏర్పడుతోంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్,ఐఆర్ఎస్ ఈ నాలుగు సర్వీసుల్లోనే 3411 ఖాళీలు ఉన్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల తెలిపారు.
ఇవీ చదవండి: ప్రభుత్వ బడుల్లో చదువుకుని మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించా... దివ్య తన్వర్ సక్సెస్ జర్నీ సాగిందిలా
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో 1,365, ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో 703, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో 1,042, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)లో 301 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని, నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జితేంద్ర సింగ్ తెలిపారు.
ఇవీ చదవండి: ఇంకో మూడు రోజులే గడువు.. మిస్ అయితే ఏడాదికి లక్ష రూపాయాలు కోల్పోయినట్లే..?
ఐఏఎస్, ఐపీఎస్ పదోన్నతుల కోటాలో ఖాళీలను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సంయుక్తంగా సెలక్షన్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్(సీఎస్ఈ)-2022 ద్వారా ఇటీవలే పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేశామని మంత్రి వివరించారు.
ఇవీ చదవండి: దేశానికి అత్యధికంగా 'ఐఏఎస్' ఆపీసర్లను ఇచ్చే రాష్ట్రం ఇదే..?