Inspiring Success Story : గెట్ లాస్ట్ అన్న చోటే.. చైర్మన్ అయ్యాను.. కానీ..

కాళ్లకి చెప్పులు కూడా లేని దుస్థితి ఈయ‌న‌ది. ఈయ‌న‌కు ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా కూడా ఏనాడు చ‌దువును మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. ఈ చ‌దువే నేడు ఈయ‌న దేశం గ‌ర్వించే స్థాయిలో నిలిపింది.

ఈయ‌నే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ చీఫ్ డాక్టర్ కె శివన్. ఈ నేప‌థ్యంలో డాక్టర్ కె శివన్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :

తమిళనాడులోని కన్యాకుమారిలో సాధారణ రైతు కుటుంబంలో శివన్ జన్మించారు. కాళ్లకి చెప్పులు ఉండేవి కావు. ప్యాంటు, షర్టులేక ధోవతి ధరించిన రోజులున్నాయి. మామిడి తోటల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో స్కాలర్‌షిప్‌లతో విద్యాభ్యాసం చేశారు. 1980లో మద్రాస్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. బెంగుళూరు ఐఐఎస్‌సీలో ఎంఈ చేశారు. ఐఐటీ బొంబాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు.

☛ Inspiration Story: భ‌ర్త కానిస్టేబుల్‌.. భార్య‌ ఐపీఎస్‌.. 10వ తరగతి కూడా చదవని భార్య‌ను..

చదువు పూర్తయిన తరువాత నేను టీచర్ అవ్వాలనుకున్నాను, అయితే అంతరిక్ష సంస్థకు ఛైర్మన్‌గా మారాను అంటూ గుర్తు చేసుకున్నారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం కోసం ఇస్రో కేంద్రానికి వెళితే అక్కడ యూజ్‌లెస్‌ ఫెలో.. నీకు జాబ్ రాదు.. గెట్ లాస్ట్ అన్నారని వెల్లడించాడు. ఇలా అనిపించుకున్న తరువాత, చివరకు అదే సెంటర్‌కు చైర్మన్‌ అయ్యానని చెప్పుకొచ్చాడు.

☛ Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచ‌ల‌న‌మే..

☛ Inspiring Story : విప‌త్క‌ర‌ ప‌రిస్థితిల్లో..ఆప‌ద్బాంధ‌వుడు..ఈ యువ ఐఏఎస్ కృష్ణ తేజ

మొదట శాటిలైట్‌ సెంటర్‌లో ఉద్యోగం రాకపోవడంతో రాకెట్‌ సెంటర్‌లో ఉద్యోగం సంపాదించి ఆ తరువాత అప్పటికే నాలుగు సార్లు విఫలమైన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యత తీసుకున్నప్పుడు స్నేహితులు, సన్నిహితులు నువ్వు పెద్ద మూర్ఖుడివి అంటూ విమర్శించారని వెల్లడించారు. ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొని జీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టును విజయవంతం చేసానని శివన్ చెప్పాడు. ఈ విజయం ఇస్రో కమ్యూనిటీకి కనపడేలా చేయడంతో ఇస్రో చైర్మన్‌ పదవి కూడా వరించిందని తెలిపాడు.

నిజానికి నా జీవితంలో ఓ గొప్ప విషయం నేర్చుకున్నాను, అదేంటంటే.. మీరు ఎక్కడైనా విమర్శలకు, తిరస్కరణకు గురైతే తప్పకుండా మీ కోసం మరో గొప్ప అవకాశం మరొకటి వేచి ఉంటుందని శివన్ చెప్పారు. ఆ తరువాత చంద్రయాన్ 2 మిషన్ ప్రారంభమైంది. దీనిని 2019 జూలై 22న అంతరిక్షంలో పంపించారు, కానీ అది 2019 సెప్టెంబరు 7 విఫలమైనట్లు తెలిసింది. ఆ తరువాత చంద్రయాన్‌-3తో ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆమోదం లభించిందని చెప్పారు.

2006లో ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డాక్టరల్ డిగ్రీ కూడా సొంతం చేసుకున్నాడు. ఈయన పీఎస్‌ఎల్‌వి, జీఎస్‌ఎల్‌వి, జీఎస్‌ఎల్‌వి MkIII వంటి ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు.

☛ IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

☛ Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

ఇస్రో చీఫ్ కె. శివన్.. చంద్రయాన్-2కు ముందు ఈ పేరు ఎవరూ పెద్దగా వినలేదు. గత కొన్నేళ్లుగా అంతరిక్ష రంగంలో సేవలు చేస్తున్నా ఆయన పెద్దగా తెరపైకి రాలేదు. కానీ చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ నుంచి సంకేతాలు ఆగిపోయిన వెంటనే ఆయన పడ్డ బాధ, పసి బిడ్డలా కన్నీళ్లపర్యంతమైన తీరు చూసి యావత్ భారతావని చలించిపోయింది. చంద్రయాన్ వంటి అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుని నడిపించిన శివన్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు.

పోఖ్రాన్ -1 అణుపరీక్షల తర్వాత సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో అమెరికా భారత్‌పై ఆంక్షలు విధించింది. దీంతో శీతల ఇంధనాల్ని వాడే క్రయోజెనిక్ ఇంజిన్లను స్వయంగా అభివృద్ధి చేసుకోవడం భారత్‌కు అనివార్యమైంది. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమయ్యే క్రయోజినిక్ ఇంజిన్లను అభివృద్ధి చేసే బృందాన్ని ముందుండి నడిపించిన శివన్ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు.

☛ Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

ఈ మధ్య ఇస్రో సాధించిన ఘన విజయాల వెనుక శివన్ చేసిన పరిశోధనలు, డిజైన్ చేసిన ఉపగ్రహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.శివన్ డిజైన్ చేసిన సితార అన్న సాఫ్ట్‌వేర్ సహకారంతోనే ఇస్రో రాకెట్లను కక్ష్యలోకి పంపుతోంది.
మంగళ్‌యాన్ వంటి ప్రాజెక్ట్‌లకు సైతం శివన్ వెన్నెముకలా ఉన్నారు. ఇటీవల కాలంలో ఇస్రో పరీక్షిస్తున్న మళ్లీ మళ్లీ వాడుకోవడానికి వీలయ్యే లాంచ్ వెహికల్స్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకి శివన్‌దే సారథ్యం. లక్ష్య సాధనలో ఈ రాకెట్ మ్యాన్ ఇప్పుడు కాస్త నిరాశకు లోనవచ్చు కానీ దేశ ప్రజలిచ్చే మద్దతే ఆయనకు కొండంత బలం.

☛ Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

#Tags