Four Sisters Doctor Success Story : నలుగురు కూతుళ్లేనా.. అని హేళన‌ చేశారు... కానీ ఇప్పుడు ఈ న‌లుగురు...

వీరిది పేదకుటుంబం. ఈ కుటుంబంలో న‌లుగురు ఆడ‌పిల్ల‌లే. ఒకే పేగు పంచుకుపుట్టిన ఈ నలుగురు అక్కచెల్లెలు ఎంబీబీఎస్‌ సీట్లు పొంది అసాధారణ మజిలీ అందుకున్నారు. విజయమంటే ఇదీ అంటున్నారు. తమ ఇంట్లో అర్ధంతరంగా తనువు చాలించిన పెద్దలకు నివాళిగా పట్టుపట్టి, ఎంబీబీఎస్‌ సీట్లు కొట్టారు. వారి గెలుపు.. ఎందరి ప్రాణాలనో నిలబెడుతుంది. మరెందరికో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

సిద్దిపేట గడ్డకు చెందిన ఈ చదువుల తల్లుల విజయగాథ ఎందరికో ఆదర్శం. కుటుంబంలో ఒకరు డాక్టర్‌ అవడం సాధారణంగా చూస్తుంటాం. ఇద్దరు డాక్టర్లు ఉండటమూ మనకు తెలుసు. ఆ ఇంట్లో మాత్రం నలుగురు కుమార్తెలూ డాక్టర్లే..! టైలరింగ్‌ చేస్తూ కూతుళ్లను డాక్టర్లు చేయడానికి తపించారు రామచంద్రం - శారద దంపతులు. ఈ నేప‌థ్యంలో ఈ కుటుంబ క‌థ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :

తెలంగాణలోని సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్‌), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. రామచంద్రం - శారద టైలరింగ్‌ చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. ఇదంతా సాధారణమే! కానీ వీరి నలుగురు కుమార్తెలు డాక్టర్లే కావడమే విశేషం. ఒకరు వైద్యవిద్య పూర్తి చేయగా, మరొకరు ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నారు. ఇంకో ఇద్దరు కుమార్తెలు ఈ ఏడాది మెడిసిన్‌లో సీట్లు సాధించారు. నలుగురు కూతుళ్లేనా.. అని హేళనలు ఎదుర్కొన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లల ఎదుగుదలను చూసి గర్వపడుతున్నారు.

☛➤ IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

మాకు రోజంతా కష్టపడితే..
రామచంద్రం, శారద ఇద్దరూ కలిసి రోజంతా కష్టపడితే రూ.800 వస్తుంది. దీంతో వారి కుటుంబం గడవడమే కష్టమైనా నలుగురు పిల్లలను చక్కగా చదివించాలని తపించారు. రామచంద్రం సోదరుడు రాజు 1992లో ఫిట్స్‌తో మృతిచెందగా, రామచంద్రం 14 ఏళ్ల వయసులో ఆయన తల్లి మల్లవ్వ గొంతు కేన్సర్‌తో మరణించింది. సరైన సమయంలో తాము గుర్తించకపోవడంతోనే సోదరుడు, తల్లిని కోల్పోవాల్సి వచ్చిందని... కుటుంబంలో ఒక్కరికైనా డాక్టర్‌ అయి ఉంటే వాళ్లు బతికేవారని అనుకునేవాడు. నలుగురు కూతుళ్లలో పెద్ద కూతురు మమత ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. ఆ తర్వాత ఆమె చెల్లెళ్లూ అదే బాట పట్టారు.

☛➤ Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

అక్క కోసం..
రోహిణి, రోషిణి ఇద్దరు కవలలు... 2023 నీట్‌ రాసిన రోహిణి 443(పెద్ద కూతురు), రోషిణి 425(చిన్న కూతురు) మార్కులు సాధించారు. రోహిణికి ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చినా చెల్లి రోషిణికి సీటు రాకపోవడంతో ఒత్తిడికి గురవుతుందని అక్క సీటు వదులుకుంది. ఆపై ఇద్దరు లాంగ్‌టర్మ్‌ శిక్షణతో ప్రిపేర్‌ అయ్యారు. దీంతో 2024 నీట్‌లో రోహిణి 536 మార్కులు, రోషిణి 587 మార్కులు సాధించారు. ఇప్పుడు రోషిణికి(చెల్లి) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకే దగ్గర చదువుకోవాలని అక్క కోసం జగిత్యాల మెడికల్‌ కళాశాలలో సీట్లు తీసుకున్నారు.

☛➤ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

ఈ కల నాకు లక్ష్యమైంది.. ఎలా అంటే.. : డాక్టర్‌ మమత, ఎంబీబీఎస్‌(7009)
డాక్టర్‌ చదవాలన్నది మా నాన్న కల. ఆ కల నాకు లక్ష్యం అయ్యింది. 2018-2024లో ఎంబీబీఎస్‌ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో పూర్తిచేశా. గైనిక్‌ లేదా జనరల్‌ మెడిసిన్‌ పీజీ చేయాలని అనుకుంటున్నా. మా అమ్మనాన్నలు ఎన్ని ఇబ్బందులు పడినా మాకు ఏనాడూ లోటు రాకుండా చూసుకున్నారు.

అక్క చూపిన దారిలోనే... : మాధురి, ఎంబీబీఎస్‌, ఫైనల్‌ ఇయర్‌(7012)
ఇంటర్‌మీడియెట్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎంబీబీఎస్‌ చదవలేనేమో అని, డిప్రెషన్‌కు లోనయ్యాను. హైదరాబాద్‌లో చదువుతున్నప్పటికీ ఇంటి నుంచే వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. ఇప్పుడు కరీంనగర్‌లోని చెల్మెడ ఆనందరావు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చేస్తున్నాను. అక్క నా ముందున్న దారిని క్లియర్‌ చేయడంతో మేం సాఫీగా నడుస్తున్నాం. జనరల్‌ మెడిసిన్‌ పూర్తి చేసి పేదలకు సేవలు అందిస్తాను.

 ☛➤ UPSC Civils Ranker Ravula Jayasimha Reddy : ఐపీఎస్ టూ ఐఏఎస్.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే..

ఇద్దరం ఒకే కళాశాలలో.. : రోహిణి, రోషిణి, ఎంబీబీఎస్, మొదటి సంవత్సరం (7011)
మేం ఇద్దరం ఒకే కళాశాల లో ఎంబీబీఎస్‌ సీట్లు సాధించడం సంతోషంగా ఉంది. మా అక్కలే మాకు రోల్‌ మోడల్‌. అమ్మానాన్న ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా చదువుపై మాకు ఉన్న ఇష్టాన్ని గుర్తించి కాదనలేదు. అక్కలిద్దరూ మాకు సరైన గైడెన్స్‌ ఇచ్చారు.

నలుగురు బిడ్డల్లో ఒకరు డాక్టర్‌ అయితేనే ఆ తల్లిదండ్రులు సగర్వంగా తలెత్తుకుంటారు. ఇద్దరు వైద్యులు అయితే.. వారి ఆనందానికి అవధులు ఉండవు. తాము జన్మనిచ్చిన నలుగురు బిడ్డలూ తెల్లకోటు వేసుకుని కండ్లముందుకు వస్తున్నారంటే.. ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి. సిద్దిపేట జిల్లా నర్సపురానికి చెందిన కొంక రాంచంద్రం (శేఖర్‌), శారద దంపతుల.. పుత్రికోత్సాహం ఇప్పుడు నాలుగింతలు అయింది. తొలిచూలు ఆడపిల్ల.. అందరికీ హ్యాపీ! రెండో కాన్పు.. ఆడకూతురు, అయినా హ్యాపీ!! మూడో కాన్పు.. కవలలు. కలువల్లాంటి ఇద్దరు ఆడపిల్లలు.. ఇంకా హ్యాపీ!! ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవ్‌! ముగ్గురమ్మలు, మూలపుటమ్మ తన ఇంట నలుగురు అమ్మాయిల రూపంలో అవతరించిందని పొంగిపోయాడు. 

➤☛ UPSC Civils Ranker Naga Bharath : మా అమ్మ చివ‌రి కోరిక ఇదే.. ఇందుకే యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..

ఆ బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి మనసు కూడా అంతే ఉప్పొంగింది. ఆ బిడ్డలను ఉన్నతంగా చదివించాలని బలంగా అనుకున్నారు ఇద్దరు. వాళ్ల కలలు సాకారం అయ్యాయి. ఆరేండ్ల కిందట పెద్దబిడ్డ ఎంబీబీఎస్‌ సీటు కొట్టింది. నాలుగేండ్ల కిందట రెండో బిడ్డ వైద్య విద్యలో ర్యాంకు సాధించింది. ఇప్పుడు చిన్నబిడ్డలు ఇద్దరూ అక్కల బాటలోనే ఎంబీబీఎస్‌ సీట్లు సాధించారు. నలుగురినీ వైద్య విద్య చదివించడం ఎందుకు? అంటే.. దాని వెనుక పెద్ద కథ ఉంది..!

కొంక రాంచంద్రం కుటుంబం నిరుపేద కుటుంబం. పదిహేనో ఏటే తల్లిని కోల్పోయాడు. గొంతు క్యాన్సర్‌ కారణంగా ఆమె నడివయసులోనే తనువు చాలించింది. రాంచంద్రం అన్నకు ఫిట్స్‌ వచ్చేది. ఓ రోజు తీవ్ర జ్వరం వచ్చింది. సిద్దిపేట దవాఖానకు తీసుకెళ్లారు. సాయంత్రం దాకా చికిత్స అందించిన వైద్యులు ‘లాభం లేదు పట్నానికి తీసుకెళ్లమని చెప్పారు. హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూశారు. తర్వాత కొన్నాళ్లకు రాంచంద్రం తండ్రి పక్షవాతంతో కన్నుమూశారు. 

➤☛ TG DSC Candidates Success Stories : ఈ ఊరు నుంచి 5 మంది ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాలు కొట్టారిలా... కానీ వీరు మాత్రం...

ఇలా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు అర్ధంతరంగా తనువు చాలించారు. చదువుకోవాలని ఎంత ఆరాటం ఉన్నా.. కుటుంబ పరిస్థితుల కారణంగా రాంచంద్రం పదో తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించాడు. కుట్టుపని నేర్చుకొని దర్జీగా స్థిరపడ్డాడు. అయితే, తమ కుటుంబంలో వరుస మరణాలకు కారణం సరైన వైద్యం అందకపోవడమే అనే భావన అతనిలో గూడుకట్టుకుంది. కొన్నాళ్లకు రాంచంద్రం వివాహం శారదతో జరిగింది. వారికి పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఆమెకు మమత అని పేరు పెట్టుకున్నారు. 

➤☛ DSC Ranker Inspirational Success Story : టీ అమ్మూతూ..రూ.5 భోజనం తింటూ.. ఒకేసారి 5 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించానిలా.. కానీ..

బిడ్డను డాక్టర్‌ను చేయాలని ఆమె పుట్టినప్పుడే అనుకున్నాడు రాంచంద్రం. తర్వాత మాధురి జన్మించింది. కొన్నాళ్లకు కవలలు రోహిణి, రోషిణి జన్మించారు. పెద్దబిడ్డకు జరిగిన కథంతా చెప్పి ‘నువ్వు డాక్టర్‌ కావాలమ్మా!’ అని చెబుతుండే వాడు రాంచంద్రం. ఆ మాటలు మమతతోపాటు మిగతా బిడ్డలూ వింటుండేవారు. ‘మేమూ డాక్టర్లం అయితాం నాన్నా!’ అనేవారు. ఆ మాటలకు ఆ తండ్రి కండ్లు చెమ్మగిల్లేవి. తల్లి మాత్రం డాక్టర్‌ చదివించడం అంటే మాటలా అనుకునేది!

నాన్న ప్రోత్సాహం..
అమ్మానాన్నల ఆశయాలను నెరవేర్చాలనే తపనతో మమత కష్టపడి చదివేది. అక్కను చూస్తూ చెల్లెండ్లూ చక్కగా చదివేవారు. తండ్రి మాట నిలబెట్టాలనే సంకల్పంతో మమత అహరహం శ్రమించేది. సరైన వైద్యం అందక మన కుటుంబం ఎంతో నష్టపోయింది. మన కష్టం ఎవరికీ రావొద్దంటే.. మన కుటుంబంలో నుంచి డాక్టర్లు రావాలి అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. మాటలకే పరిమితం కాలేదు నాన్న. ఎన్ని కష్టాలు ఎదురైనా మా చదువులకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. 

☛➤ Two Sisters Success Storeis : మేము అక్కాచెల్లెళ్లు.. ఒకే సారి ఇద్ద‌రం ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టాం... ఎందుకంటే..?

మొదట్లో అందరం తెలుగు మీడియంలో చదివాం. ఒకేసారి ఇంటర్‌లో ఇంగ్లిష్‌ మీడియంలోకి మారే సరికి కొంత ఇబ్బంది అయింది. ఏం కాదు.. మనం చదవాలి.. మరికొందరికి స్ఫూర్తినివ్వాలి అని వెన్ను తట్టి మమ్మల్ని నాన్న ముందుకు నడిపించారు. అలా 2018లో ఎంబీబీఎస్‌ సీటు సాధించాను. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో కన్వీనర్‌ కోటాలో వైద్యవిద్యలో చేరాను. 2024లో నా ఎంబీబీఎస్‌ పూర్తయింది. ప్రస్తుతం పీజీ కోసం ప్రిపేర్‌ అవుతున్నాను. మా నాన్న ఆశయానికి నాంది నేను అయ్యాను. నన్ను చూసి మా చెల్లెండ్లు కూడా ఎంబీబీఎస్‌ సీటు సాధించడం గర్వంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది మమత.

ఈమే మాకు స్పూర్తి..
అక్క నడిచిన బాటలోనే ముగ్గురు చెల్లెండ్లూ నడిచారు. ఆమె స్ఫూర్తితో పట్టుదలగా చదివారు. అమ్మానాన్నల కష్టం చూస్తూ పెరిగాం. ఆడపిల్లలను ఇంతగా చదివించడం అవసరమా...?! అని చాలామంది నాన్నను అంటుండేవారు. నా బిడ్డలు చదువుల తల్లులు అని సమాధానం ఇచ్చేవారు నాన్న. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. మాకు ఏ లోటూ రానివ్వలేదు. 

మా ఎడ్యుకేష‌న్ అంతా..
1వ‌ తరగతి నుంచి 8వ‌ తరగతి వరకు సిద్దిపేటలోని శ్రీసాయి విద్యాలయం (తెలుగు మీడియం), సిద్ధార్థ పాఠశాలలో తొమ్మిది, పది చదివాను. ఇంటర్‌ హైదరాబాద్‌లో చేశాను. 2020లో ఎంబీబీఎస్‌ సీటు సాధించి కరీంనగర్‌ చెల్మెడ ఆనందరావు కళాశాలలో వైద్య విద్యలో చేరాను. ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చేస్తున్నాను. 

అనారోగ్యం కారణంగా..
మా అక్కకు ఎంబీబీఎస్‌ సీటు వచ్చినప్పుడే నాకూ వచ్చేది. కానీ కొంచెం అనారోగ్యం కారణంగా నాన్న ఇంటికి తీసుకువచ్చారు. నాకు ఆరోగ్యం బాగలేకపోవడంతో కుంగుబాటుకు గురయ్యా. రెండేండ్లు ఇంటి దగ్గరే ఉండి చదువుకున్నా. ఆన్‌లైన్‌లో కోచింగ్‌ తీసుకున్నా. దీంతోపాటు యూట్యూబ్‌ పాఠాలు వింటూ ప్రిపేర్‌ అయ్యాను. మొత్తంగా 2020లో ఎంబీబీఎస్‌ సీటు సాధించాను’ అని తన విజయగాథను పంచుకుంది మాధురి.

చాలామంది సూటిపోటీ మాటలు అనేవారు.. అయినా
నలుగురు ఆడపిల్లలని, వారిని హైదరాబాద్‌లో చదివిస్తున్నామని చాలామంది సూటిపోటీ మాటలు అనేవారు. అయినా కుంగిపోకుండా పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలకున్నాం. టైలరింగ్‌ చేస్తూ వచ్చే కొద్ది డబ్బుతోనే పిల్లలను లోటు లేకుండా పెంచాం. అప్పుడు హేళన చేసిన వారే ఇప్పుడు మా నలుగురు కూతుర్లు మెడిసిన్‌ చేస్తుంటే సరస్వతీ పుత్రికలు అని మెచ్చుకోవడంతో మా బాద, కష్టమంతా మర్చిపోతున్నాం. మాది పేద కుటుంబం. పిల్లల చదువు నిమిత్తం ఎవరైనా దాతలు సాయం చేస్తే వారు ఉన్నత చదువులకు మార్గం ఏర్పడుతుందని అంటున్నారు రామచంద్రం, శారద. అలాగే ఈ సరస్వతీ పుత్రికలకు అండగా నిలవాలనుకునే వారు 98499 54604ను
సంప్రదించవచ్చు.

ఎమ్మెల్యే హరీశ్‌రావు సార్‌...

నిజాయతీగా బతికితే... ఆ భగవంతుడే దారి చూపుతాడు. చాలాసార్లు మిత్రులు ఆర్థికంగా ఆదుకునేవారు. మళ్లీ వాళ్లకు తిరిగి ఇచ్చేస్తుంటాం. వారి సాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేం. ఇంటి మీద కూడా అప్పు తీసుకొని బిడ్డలను చదివిస్తున్నాం. మా గురించి తెలుసుకొని ఎమ్మెల్యే హరీశ్‌రావు సార్‌ మమ్మల్ని పిలిపించుకున్నారు. సార్‌ మాకు సాయం చేశారు. వారికి కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఆదుకుంటానని చెప్పారు. సార్‌కు మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.

#Tags