Fake Universities: ఆ 20 వర్సిటీలు నకిలీవి.. వర్సిటీలు ఇవే

న్యూఢిల్లీ: దేశంలో మరో 20 సంస్థలు విశ్వవిద్యాలయాలుగా చెలామణి అవుతున్నాయని, అవన్నీ నకిలీవని యునివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఆగ‌స్టు 2న‌ ప్రకటించింది.
ఆ 20 వర్సిటీలు నకిలీవి.. నకిలీ వర్సిటీలు ఇవే

ఈ 20 సంస్థల్లో ఎనిమిది ఢిల్లీలోనే ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఉత్తరప్రదేశ్‌లో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ (ఓపెన్‌) యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్‌ అనే నాలుగు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి.

పశ్చిమబెంగాల్, ఏపీల్లో రెండేసి నకిలీ వర్సిటీలున్నాయి. కర్ణాటకలో బదగాన్వీ సర్కార్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, కేరళలో సెయింట్‌ జాన్స్‌ వర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్‌ యూనివర్సిటీ, పుదుచ్చెరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నకిలీవే’’ అని యూజీసీ కార్యదర్శి మనీశ్‌ జోషి స్పష్టంచేశారు.

చదవండి: Age limit: అధ్యాపకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంపు..

ఢిల్లీలోని 8 నకిలీ వర్సిటీలు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అండ్‌ ఫిజికల్‌ హెల్త్‌ సైన్సెస్‌; కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్, దరియాగంజ్‌; యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ ఒకేషనల్‌ యూనివర్సిటీ; ఏడీఆర్‌–సెంట్రిక్‌ జ్యుడీషియల్‌ యూనివర్సిటీ; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌; విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌–ఎంప్లాయిమెంట్‌; ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ 

చదవండి: University Grants Commission: విద్యార్థులు ఏబీసీ ఐడీలు క్రియేట్‌ చేయాలి

నకిలీ వర్సిటీలు ఇవే..

ఢిల్లీ

 

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అండ్‌ఫిజికల్ హెల్త్‌ సైన్సెస్‌
కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌-దర్యాగంజ్‌
యూనైటెడ్ నేషన్స్ విశ్వవిద్యాలయం
వొకేషనల్‌ యూనివర్సిటీబీ
ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యూరిడికల్‌ యూనివర్సిటీ
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌
ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం)
పశ్చిమబెంగాల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చి, ఠాకూర్పుకూర్
ఆంధ్రప్రదేశ్ క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, గుంటూరు
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం
కర్ణాటక బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, బెల్గాం
కేరళ సెయింట్ జాన్స్ యూనివర్సిటీ
మహారాష్ట్ర రాజా అరబిక్ యూనివర్సిటీ
పుదుచ్ఛేరి శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్

#Tags