YVU Semester Exams: డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆకస్మిక తనిఖీ..!
Sakshi Education
వైవీయూలో నిర్వహిస్తున్న సెమిస్టర్ పరీక్షల్లో తనిఖీలు నిర్వహించారు వీసీ చింతా సుధాకర్..
![Inspection at Yogi Vemana University semester exams](/sites/default/files/images/2024/05/03/yvu-exams-inspection-1714722652.jpg)
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. ఈశ్వర్‌రెడ్డితో కలిసి వీరబల్లి, సుండుపల్లె డిగ్రీ కళాశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించారు.
Robotic Surgery: రోబోటిక్ సర్జరీపై వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
విద్యార్థుల వసతులను గమనించారు. ప్రతి కేంద్రంలో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాసుకునేలా చూడాలని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అబ్జర్వర్లు హైపవర్ కమిటీ సభ్యులు తనిఖీలు నిర్వహించారు.
School Fees 2024-25: స్కూలు ఫీజులు తగ్గుతాయా?.. క్లాస్–1 అడ్మిషన్ వయో పరిమితి ఏంత?
Published date : 03 May 2024 01:20PM