Robotic Surgery: రోబోటిక్ సర్జరీపై వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం రోబోటిక్ సర్జరీపై వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ షాహిద్ రోబోటిక్ సర్జరీ ద్వారా కలిగే ప్రయోజనాలను విపులంగా తెలియజేశారు. శస్త్రచికిత్సలు ఎంత సులభంగా చేయవచ్చో పవర్‌పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. వెన్నెముక, యురాలజీ, గైనకాలజీ, అన్ని రకాల కేన్సర్లుకు రోబోటిక్ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
Gurukul School Admissions: గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ!
ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు మాట్లాడుతూ.. డాక్టర్ షాహిద్ వైద్య కళాశాల 2008 బ్యాచ్‌కు చెందిన విద్యార్థి అని, నారాయణ హృదయాలయలో జనరల్ సర్జరీ, హైదరాబాద్‌లోని ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీలో గ్యాస్ట్రోఎంటరాలజీ పూర్తి చేశారన్నారు. బిరియాట్రిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీలపై ఫెలోషిప్ పొంది విద్యనభ్యసించిన కళాశాలలోనే గెస్ట్ లెక్చర్ ఇవ్వడం స్పూర్తిదాయకమన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ డాక్టర్ షాహిద్ ఉన్న శిఖరాలను అధిరోహించి, జిల్లా ప్రజలకు సేవలందించడం అభినందనీయమన్నారు.
SAIL Recruitment 2024: ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ వేముల శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపళ్లు డాక్టర్ షారోన్ సోనియా, డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ నవీన్, ప్రొఫెసర్లు భీమసేనాచార్, రామస్వామి, శివశంకర్‌నాయక్, సుచిత్రశౌరి, వైద్యులు డాక్టర్ షహజీర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశీనాయుడు పాల్గొన్నారు.
School Fees 2024-25: స్కూలు ఫీజులు తగ్గుతాయా?.. క్లాస్–1 అడ్మిషన్ వయో పరిమితి ఏంత?
Tags
- robotic surgery
- Medical students
- treatments
- awareness sessions
- Renowned Robotic Surgeon Dr. Mohammad Shahid
- Government Medical College
- Principal Dr. Manikya Rao
- awareness on robotic surgery
- latest techniques in surgery
- ananthapur news
- Powerpoint Presentation
- Surgical technology
- medical education
- Healthcare advancement
- Anantapur awareness program
- sakshieducation updates