UGC: ఉన్నత విద్యా సంస్థల్లో అభ్యర్థులు దొరకకుంటే... రిజర్వ్‌డ్ పోస్ట్ డి-రిజర్వ్ కాదు!
Sakshi Education
ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వు చేసిన పోస్టుల్లో సంబంధిత కేటగిరీల అభ్యర్థులు దొరకని సందర్భాల్లో ఆయా పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)తాజా ప్రతిపాదిత మార్గదర్శకాలల్లో పేర్కొంది.
ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలను అభిప్రాయ సేకరణ కోసం ఆన్‌లైన్‌లో ఉంచింది.
అయితే, యూజీసీ ప్రతిపాదించిన మేరకు ఉన్నత విద్యాసంస్థల్లోని రిజర్వుడు పోస్టులు వేటినీ కూడా డీ రిజర్వుడుగా మార్చడం లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పందిస్తూ ‘ఉన్నత విద్యా సంస్థల్లోని రిజర్వుడు పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించడమనే విధానం గతంలో లేదు, ఇకపై అమలు కాబోదు. రిజర్వుడు కేటగిరీలోని అన్ని బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నత విద్యాసంస్థలదే’అని స్పష్టం చేశారు.
Emmanuel Macron: భారత విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్..
Published date : 30 Jan 2024 10:46AM