TG EdCET 2025 Schedule: ఎడ్‌సెట్ 2025 షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే!
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(TGCHE) 2025–26 సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల బీఈడీ రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TG EdCET 2025) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు (SC/ST/BC/PWD) 40% మార్కులు ఉండాలి.
చదవండి: MIDHANI Jobs: పదోతరగతి, ఐటీఐ అర్హతతో మిధానిలో ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా ఎంపిక!
![]() ![]() |
![]() ![]() |
ఎడ్‌సెట్ షెడ్యూల్ ఇదే..
విషయం | ముఖ్యమైన తేదీలు |
నోటిఫికేషన్ | మార్చి 10, 2025 (సోమవారం) |
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం | మార్చి 12, 2025 (బుధవారం) |
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ (లేటు ఫీజు లేకుండా) | మే 13, 2025 (బుధవారం) |
పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) |
జూన్ 1, 2025 (ఆదివారం) 1st సెషన్: 10.00 - 12.00 2nd సెషన్: 2.00 - 4.00 |
Published date : 07 Feb 2025 08:42AM